గూడూరు :
గూడూరులోని హెచ్ డీ ఎరీనా ఇండోర్ స్టేడియంలో శనివారం ఆడుదాం ఆంధ్ర క్రీడా పౌటీలలో భాగంగా నిర్వహించిన మహిళల షటిల్ పోటీలలో గూడూరు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి ఐదు జట్లు పాల్గొన్నాయి. గూడూరు జట్టు అంషద్ ఫర్హీన్, భవ్య ప్రథమ స్థానం, వాకాడు మండల జట్టు ద్వితీయ స్థానం, కోట మండల జట్టు తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. గూడూరు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు గెలుపొందిన జట్ల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. పీడీలు శివ కుమార్, కరీముల్లా, వెంకట్, శశికళ, ప్రసాద్ పాల్గొన్నారు.