Advertisements

మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రధానం.

గూడూరు.
75వ. గణతంత్ర దినోత్సవం పుష్కరించుకొని ప్రముఖ ఆడిటర్. పూర్ణచంద్రరావు శుక్రవారం గూడూరు పట్టణంలోని జడ్పీ బాయ్స్. జడ్పీ గర్ల్స్ పాఠశాలలలో చదువుతున్న 8. 9. 10 తరగతిలో ఇంగ్లీషు. మ్యాథమెటిక్స్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రధానం చేశారు. పూర్ణిచంద్రరావు తండ్రి వెంకటసుబ్బయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సూర్య బాబు. శ్రీరామమూర్తి .ప్రబల శాంతి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నగదును ప్రధానం చేశారు. ఇందులో జడ్పీ బాయ్స్. జడ్పీ గర్ల్స్ లో చదువుతున్న. బి మనోజ్ కుమార్ ..ఎం యాదేశ్. పేట చందర్. సుధా శ్రావన్య. ఎం మహేశ్వరి. కే లోకేశ్వరి లకు నగదు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర మాట్లాడుతూ తమ తండ్రి జడ్పీ హైస్కూల్లో 12 సంవత్సరాలు పాటు ఉపాధ్యాయుడిగా పని చేశారని. తాము కూడా ఇదే పాఠశాలలో చదివి. పాఠశాలకు పూర్వ విద్యార్థిగా తమ వంతు సాయం చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు నగదు బహుమతి ప్రధానం చేయడం క్రమానికి శ్రీకారం చూడడం జరిగిందన్నారు. జడ్పీ బాయ్స్ .గర్ల్స్ పాఠశాలకు లైబ్రరీ కి సంబంధించిన పుస్తకాలను బహుకరిస్తామన్నారు.. అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు పెద్ద చదువులకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ మాధవ్ లత. ఉపాధ్యాయులు పార్వతీ ప్రవీణ్. ఎస్ అనిత .కే వసంత. ఆర్ వెంకటేశ్వరరావు. వై విజయమ్మ. ఎస్ సుభాషిణి. శ్రీదేవి. పద్మప్రియ. విజయలక్ష్మి. సుభాషిని. నాగమణి. శివ నారాయణ. లావణ్య . వ్యాయామ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులచే నృత్య ప్రదర్శన. జాతీయ గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు.

Leave a Comment

You May Like This