గూడూరు : గూడూరులోని మున్సిపల్ కార్యాలయం వద.ద గురువారం వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున.న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన, పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం జన ఔషది తదితర పథకాలపై ఆ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మిటికిరి వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణాధ్యక్షుడు అరికట్ల బాలకృష్ణ నాయుడు, గాలి ప్రకాష్ నాయుడు, బిందురెడ్డి, గుంజి శ్రీనివాసులు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.