Advertisements

బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్

????తిరుపతి నగరంలోనీ కచ్చిపి కళాక్షేత్రంలో 14వ ఓటరు దినోత్సవ వేడుకలు

???? జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా ఆర్ డి ఓ లు, ఈ ఆర్ ఓలకు ,ఏ ఈర్ ఓ లకు మరియు బి యల్ ఓ లకు ప్రశంస పత్రాలు

????గూడూరు ఆర్డివో ఎం.కిరణ్ కుమార్ కు బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డు

???? జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకొన్న ఆర్డివో కిరణ్ కుమార్

???? విధి నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్డివో కిరణ్ కుమార్

???? అధికారి కాదు -సేవకుడు ఆర్డివో కిరణ్ కుమార్

???? ఆర్డివో కిరణ్ కుమార్ కు అభినందనలు వెల్లువ

????18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

????ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్

18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డిపేర్కొన్నారు.గురువారం తిరుపతి నగరం లోని కచ్చిపి కళాక్షేత్రం నందు జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓట దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ కమిషనర్ మరియు ఈ ఆర్ ఓ డి. హరిత, ఆర్ డి ఓ లు మరియు ఈ ఆర్ ఓ ల ముఖ్య అతిథిలు గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1950 సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని,2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 న జాతీయ ఓటర్ దినోత్సవం జరువుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కునువినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల అన్నింటి కంటే ముఖ్య మైనది ఓటు హక్కుని, ఓటు హక్కు సమాజానికి సంబందించిదని తెలిపారు. ఓటు వల్ల నాకు ఏమీ ఉపయోగం ఉందని అనుకో రాదని, మీరు ఎన్నుకొని ప్రభుత్వము మీ హక్కులను కాపాడే ప్రభుత్వం గా ఉండాలంటే అందరూ ఓటు హక్కును వినియోగించే కోవలన్నారు.

కులం,మతం,డబ్బులు చూడకుండా వంద శాతం ఓట్లు వేసినట్లు అయ్యితే అబ్బుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చుఅన్నారు. జిల్లాలో 79 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించు కున్నారని మిగిలిన 31 శాతం మంది కూడా ఓటుకు వినియో గించుకోవడానికి,ఓటు హక్కు వినియోగం పై జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అంత చదువు కున్న వారేనని రాష్ట్ర లో అక్షరాస్యత కూడా బాగుందని, ప్రజల వాయిస్ ఓటు హక్కు అని ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని నియమించుకోవడం జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు, డబ్బుకు లొంగకుండా నిర్భయంగా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు.

దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి

దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి అనీ జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి పిలుపునిచ్చారు. యువత భాగస్వామ్యం కావాలి ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 18, 19 సంవత్సరాల యువతకు ఓటు హక్కుకు ప్రోత్సహిస్తుదన్నారు. మన దేశం అన్ని దేశాల కంటే ఎంతో అభివృద్ధి సాధించిందని, రాబోయే కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థికంగా అభివృది చెందినదేశంఅవుతుందన్నారు.జిల్లాలో సుమారు 53 వేల మంది 18,19 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్

గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం. కిరణ్ కుమార్ తిరుపతి, నెల్లూరు జిల్లాలో తెలియని వారు లేరంటే అతిశయోక్తే లేదు అంతలా ఆయన గుర్తింపు పొందారు. కారణం లేకపోలేదు 2022లో గూడూరు ఆర్డివో గా బాధ్యతలు చేపట్టిన ఎం. కిరణ్ కుమార్ 2022 మాండస్‌ తుఫాన్‌ లో ఆయన చేసిన సాహసాలు,2023లో మిచౌంగ్ తుఫాన్ లో ఆయన చేసిన సాహసలకు సాక్ష్యతూ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు అంటే ఆర్డివో సేవలు ఏ స్థాయిలో జరిగాయో అర్ధం అవుతుంది.

అంతేకాకుండా కోట అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు, వాకాడు లో మరియు చిట్టమూరు మండలం లోని మల్లాం లోని sri సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం వద్ద ఆక్రమణలు తొలగింపు, గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆక్రమణలు, కోట లో ఆక్రమణలు తొలగింపు లో ఆయన సేవలు చరిత్ర పుటల్లో శాశ్వతం గా నిలిచి ఉంటాయి.

అదేవిధంగా విధి నిర్వహణలో అహర్నిశలు శ్రమించడం, బాధితులు సమస్యల పరిష్కారం లో ఆయన చూపే చొరవ ప్రజల్లో డేరింగ్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. ఎక్కడ కూడ చిన్న మచ్చ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం విజయవంతం చేయడం లో ఆయనకు ఆయనే సాటి వేంకటగిరి జాతర, వేంకటగిరి లో సియం జగన్ నేతన్న సదస్సు విజయవంతం చేయడం లో క్రియాశీలక పాత్ర పోషించారు.

గూడూరు డివిజన్ లో ఓటరు నమోదు పక్రియ వేగవంతం చేయడం తో పాటు ఎన్నికల అధికారులు ఇచ్చిన ప్రతీ కార్యక్రమంలో నిమగ్నం అయ్యి విజయవంతం చేసి తిరుపతి జిల్లా లో గూడూరు డివిజన్ కు పేరు తీసుకోని వచ్చారు. ఆర్డివో కిరణ్ కుమార్ చేసిన సేవలని గుర్తించి బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఎన్నిక చేసి గురువారం 14వ ఓటరు దినోత్సవం సందర్బంగా తిరుపతి లోని కచ్చిపి కలక్షేత్రం లో జరిగిన ఓటరు దినోత్సవం కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా ఆర్డివో కిరణ్ కుమార్ అవార్డు ప్రశంస పత్రం అందుకోన్నారు. ఈ సందర్బంగా రెవిన్యూ అధికారులు, సిబ్బంది, పలువురు ఆర్డీవో కు అభినందనలు తెలియజేశారు.

ఉత్తమ అధికారులు కు ప్రశంస పత్రాలు అందజేత

14ఓటరు దినోత్సవం సందర్బంగా పలువురు ఆర్ డి ఓ లు మరియు ఈ ఆర్ ఓలకు ,ఏ ఈర్ ఓ లకు మరియు బి యల్ ఓ లకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలనుఅందజేశారు ,18 సంవత్సరాలు నిండి ఓటర్ గా నమోదైన యువతకు ఓటర్ గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు, 5 మంది వయోవృద్ధుల కు సన్మానం చేశారు, అనంతరం కమిషనర్ ఓటు హక్కు వినియోగంపై ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.

అంతకు ముంది నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి ఆర్డీఓ తహశీల్దార్ ల తో కలసి 14 వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్ నమోదు,ఓటు హక్కు వినియోగం పై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఇక ఓటరుగా నమోదు చేసుకోకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటర్ జాబిత లో మీ పేరు ఉందొ లేదు చూచుకోవాలని, లేక పోతే 6 ఫారం ద్వారా నమోదు చేయుకోవచ్చునని తెలిపారు. ఈ ర్యాలీ నగర పాలక సంస్థ కార్యాలయం నుండి కచ్చిపి కళా క్షేత్రం వరకు నిర్వహించిన ర్యాలీలో బి యల్ ఓ లు,సచివాలయ ,కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జి యం. వి ఆర్.చంద్రమౌళి,
ఆర్డీ ఓలు మరియు ఈ ఆర్ ఓ లు, ఏ.నిశాంత్ రెడ్డి,యం.కిరణ్ కుమార్,ఆర్.చంద్రముని,యన్.రవి శంకర్ రెడ్డి,శ్రీనివాసులు, అర్బన్ తహశీల్దార్ వెంకటరమణ, ఏ ఈ ఆర్ ఓ లు రమేష్ బాబు,ప్రేమిలా,సుబ్రహ్మణ్యం, ముని శైలజ, భూపతి, వై సుబ్రమణ్యం, బియల్ ఓ లు,సూపర్వైజర్లు, మోహన్,సుజాత,హరిబాబు,గిరి,అనురాధ,రాజశేఖర్,వినోద్ కుమార్,సచివాలయ సిబ్బంది కళాశాల విద్యార్థులు వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This