యువత అధ్వర్యంలో భారీగా యువ దళపతి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు…
గూడూరు నియోజకవర్గం(TDP)
జాతీయ ప్రధాన కార్యదర్శి, యువదళపతి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయం నందు యువత మరియు నాయకులు మధ్య భారీగా నిర్వహించిన….
పాశిం సునీల్ కుమార్
మాజీ శాసన సభ్యులు & నియోజకవర్గం ఇంచార్జ్
మీడియాతో మాట్లాడుతూ…..
మాజీ మంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనాయకుడు నారా.లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయం నందు యువత, TNSF, నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలతో కలసి కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఈ రోజు నేతాజీ సుబాష్ చంద్ర బోస్ జయంతి రోజునే, మా యువ నాయకుని జన్మదినం కావడం చాలా సంతోషం అన్నారు.
రాష్ట్రంలో ప్రతి వాడ నందు వేసిన CC రోడ్లు గాని, ప్రతి గ్రామం లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లు గాని, మా యువ నాయకులు పంచాయతి రాజ్ మినిస్టర్ గా చేసిన అభివృద్దే అని అన్నారు.
వారు చేసే ప్రతి పనిని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వస్తున్నారు.
చరిత్ర లో నిలిచిపోయే విదంగా యువగలం ముగింపు కార్యక్రమం చేశారు. అప్పటి నుండి ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుని ఉంది అని అన్నారు.
నారా లోకేష్ బాబు వారి తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు,రాబోయే రోజులలో ఆయన తెలుగుదేశం పార్టీ ని ముందుండి నడిపిస్తారని,
ఆ భగవంతుడు వారికి అష్ట ఐస్వర్యాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్,గూడూరు పట్టణ/ రూరల్ మండల పార్టీ అద్యక్షులు పులిమి శ్రీనివాసరావు,కొండూరు వెంకటేశ్వర్లు రాజు,తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం.శ్రావణి రెడ్డి,కార్యదర్శి గుండాల భారతి,పట్టణ ప్రధాన కార్యదర్శి నరసింహులు,పట్టణ మహిళా అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి,పార్లమెంట్ యువత ప్రధాన కార్యదర్శి బత్తిన ప్రణీత్ యాదవ్, నియోజకవర్గ యువత అద్యక్షుడు మువ్వా చరణ్, పార్లమెంట్ యువత సభ్యులు కళ్యాణ్,వేముల సునీల్, గుండాల సందీప్,పురిణి దయాకర్,వెంకటసాయి,శ్రీకాంత్,పార్వతయ్య TNSF సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు