ప్రెస్ మీట్ లో మాట్లాడిన దృశ్యం
తిరుపతి జిల్లాగూడూరు పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ జాతీయఅధ్యక్షుడు చంద్రబాబునాయుడు సభలకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి సీఎం జగన్ రెడ్డి తో సహా వైసీపీ నాయకులకు ఓటమి భయం పెట్టుకుందని ఆయన అన్నారు. దళితులకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల సంక్షేమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు.రానున్న ఎన్నికల్లో వైసీపీకి అన్ని వర్గాల ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.కళ్ళ బొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి అందరిని మోసం చేశారన్నారు.ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం ను ఏర్పాటు చేసామని, వారిని ఆకాశంలో పెట్టి దళితులను పాతాళానికి తొక్కడం ఈ ప్రభుత్వం నైజంని అన్నారుప్రజలారా విగ్రహాన్ని చూసి మోసపోవద్దు,SC లపై జరిగిన దారుణాలను మర్చిపోవద్దు,
దళిత ద్రోహి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది YSRCP నే, ప్రజలకు మంచి పాలన ఇవ్వాల్సిన ప్రభుత్వం దాడులు చేయిస్తుందిఎన్నికల ముందు ప్రలోభాలకు గురి చేసేందుకే అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారని ఆరోపించారు. దళితులకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల సంక్షేమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు.ఐదేళ్ల పాలనలో దళితులపై వేలకు పైగా దాడులు జరిగాయని, వేల మంది దళితుల్ని హత్య చేశారన్నారు. దళితులకు రాజ్యాంగ బద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే అన్నారు.దళిత బిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తీసుకొచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని నాలుగేళ్ల పాటు అటకెక్కించి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరుమీద విదేశీ విద్యగా మార్చి రాజ్యాంగ నిర్మాతను అవమాన పరచి మీరా అంబేద్కర్ గారి గురించి మాట్లాడేది అని అన్నారు.నవరత్నాలపై నమ్మకం లేక దొంగ ఓట్లపైనే ఆదారపడ్డారని ఎద్దేవా చేశారు.దళిత ద్రోహి ,అవినీతి పరుడు ,ఈ ముఖ్యమంత్రి గారని అన్నారు.దళితుడైన కోడికత్తి శ్రీనును ఎన్నికల ముందు అక్రమంగా కేసులో ఇరికించి ఐదేళ్లుగా ఇప్పటికి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఊదరగొట్టే ఈ ముఖ్యమంత్రి గారి పాలనలో వారానికి నలుగురు దళితులు హత్యలకు,ఆరుగురు హత్యాయత్నాలకు, రోజుకు ఇద్దరు దళితులు దాడులకు, వారానికి 3 ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు దళితులు ఎస్టీలు మైనార్టీలు ఓట్లు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అరాచ పాలనకు చమర గీతం పాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య,దువ్వూరు రవీంద్ర రెడ్డి,పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అద్యక్షులు ఇస్రాయెల్ కుమార్,నియోజకవర్గ మైనారిటీ అద్యక్షులు MD అబ్దుల్ రహీం,SC అద్యక్షులు ఎసుపాక పెంచలయ్య,నాయకులు శ్రీనివాసులు,కృష్ణయ్య, నాగేంద్ర,రవికుమార్,సురేంద్ర,గురవయ్య,వెంకటయ్య,సురేష్,అలిహుస్సేన్,నాజరుద్దిన్,యువత సునీల్,సందీప్,నాగార్జున,మహాజన సైన్యం –చెవురు సురేంద్ర,లీగల్ సెల్ అద్యక్షులు చైతన్య తదితరులు పాల్గొన్నారు