తిరుపతి అసెంబ్లీ 1 వ వార్డులోని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు బాలసుబ్రమణ్యం గారి స్వగ్రహం నందు శనివారం ఉదయం మంగళం రోడ్డులోని రిజిస్ట్రేషన్ కాలనీ లో పార్టీ జెండా ఆవిష్కరణ ఆంధ్ర ప్రదేశ్ ఇంచార్జి ఆర్.మణి నాయుడు ఆవిష్కరించిన అనంతరం వార్డ్ కార్యాలయం ప్రారంభించి వారి చేతులమీదుగా వార్డ్ ఇంచర్జులకు భాద్యతలు అప్పగిస్తూ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బొంతల రాజేష్ రాయలు పరిచయం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కి ఆమ్ ఆద్మీ పార్టీ తోనే ప్రత్యేక హోదా సాధ్యమని, జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో “చీపురు” గుర్తుకు ఓటేసి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం బలపరచలిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సీరా రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి, కోఆర్డినేటర్ అర్ కే పట్టేం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివక చందు , తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు కందనూరు జగదీష్, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి పవన్ , రాష్ర్ట మహిళ కమిటీ సభ్యురాలు ఎమ్. నందిని తదితరులు పాల్గొన్నారు. .