????గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు సాయంత్రం జరుగు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గూడూరు నుండి భారీ ఎత్తున బయలుదేరిన వైసీపీ శ్రేణులు…????
విజయవాడ లోనిస్వరాజ్ మైదానం లో 124 అడుగుల ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో గూడూరు నుండి వైసీపీ నాయకులు,కార్యకర్తలు విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ మేరుగ మురళి ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో వాహనాలలో విజయవాడకు తరలి వెళ్లేందుకు వైసిపి నాయకులు కార్యకర్తలు సిద్ధమయి ముందుగా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి విజయవాడ బయలుదేరారు…