Advertisements

పని ఒత్తిడిలో ఆట విడుపు క్రికెట్ పోటీలు రెండవ పట్టణ సీఐ వెంకటేశ్వరరావు


గూడూరు :
నిత్యం పని ఒత్తిడిలో ఉండే ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారికి, పాత్రికేయులకు క్రికెట్ టోర్నమెంట్ ఆటవిడుపుగా ఉంటుందని గూడూరు రెండవ పట్టణ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రికెట్ ఆడి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సభ్యులు ఒక వేదిక మీదకి వచ్చి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములకు అతీతంగా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు జర్నలిస్టులు లాయర్లు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This