నిందితులైన రౌడీ షీటర్లను గుర్తించి
వార్నింగ్
మార్పు చెంది జీవించండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోండి.
క్రమశిక్షణతో మెలగండి, మీ జీవితాలు బాగు చేసుకోండి.
సంఘ విద్రోహకులుగా మారకండి తోకలు కట్ చేస్తాం.-
మంచి వారిగా మారండి , ఉపాధి కల్పిస్తాం.
రౌడీ షీటర్స్ పై 24 గంటలు నిఘా
మళ్లీ నేరాలు చేస్తే పీడీ యాక్ట్లు నమోదు
చేస్తాం.
DSP రూరల్ సి ఐ, ఎస్ ఐ
సంక్రాంతి పండుగ మరియు జరగబోవు ఎన్నికలు దృష్ట్యా శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా’ జిల్లా ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ నందు గూడూరు పట్టణ,రూరల్ పరిధిలోని గతంలో నిందితులైన రౌడీ షీటర్లను గుర్తించి వారికి గూడూరుDSP, సూర్యనారాయణ రెడ్డి, రూరల్ CI, వేణుగోపాల్ రెడ్డి SI. మనోజ్ కుమార్ , కౌన్సిలింగ్ ఇచ్చారు, మంచి వారిగా మారి మంచిగా బ్రతకాలని సూచించారు , మార్పు చెందితే స్వయంగా ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తామని వారు తెలియజేశారు.కిడ్నాప్స్, మర్డర్స్, దాడులు, చొరబాటులు, బెదిరింపుల,దొంగతనాలు నేర ఆలోచనలు మాని సమాజంలోమంచిగా బ్రతకాలని కౌన్సెలింగ్ ఇచ్చారు . మరో సారి ఇలాంటి కార్యకలాపాలు చేస్తే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని, ఏడాది పాటు జైళ్లలో పడేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్స్ పై 24 గంటల ప్రత్యేక నిఘా ఉంటుందని గుర్తు చేసారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అసాంఘిక విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తిగా మారిన వారిపై రౌడీ షీట్ తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలపారు.