గూడూరు రూరల్ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. రూరల్ ఎస్ ఐ. మనోజ్ కుమార్.
????????????????????????????????????
- కోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం
- జూదం అనే వ్యసనం తో జీవితాలను నాశనం చేసుకోవద్దు.
- సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించం
తిరుపతి జిల్లా గూడూరు మండలం
రూరల్ ఎస్, ఐ మనోజ్ కుమార్ స్థానిక మీడియా star 9 live మరియు wisdomtvnews ఛానెల్ తో మాట్లాడుతూ, ముందస్తు గా గూడూరు రూరల్ ప్రజలకు భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను , పురస్కరించుకుని, గూడూరు రూరల్ గ్రామాల్లోకోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటామని, గూడూరు రూరల్ సబ్ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందాలు, జూదం, మట్కా వంటి వాటి వలన అనేక మంది సులభంగా వచ్చే అధిక డబ్బులకు ఆశపడి పందాలు కాసి వారి ధనాన్ని నష్టపోతున్నారన్నారు. దీనివలన వారి కుటుంబాల జీవనవిధానం అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందన్నారు. గూడూరు రూరల్ గ్రామాల్లో ఎక్కడైన కోడిపందాలు, జూదం నిర్వహించకుండా వుండేందుకు గతంలో వీటిని నిర్వహిస్తూ, ఆడుతూ పట్టుబడిన వారు మరల వాటి జోలికి వెళ్లకుండా బైండవర్ చెయ్యడం జరుగుతుందన్నారు. గతంలో కోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలపై, నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించినా, పందేలు నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొందరు యువకులు జూదం అనే వ్యసనానికి బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. జూదంలో కోల్పోయిన డబ్బులను సంపాదించడానికి చిన్నచిన్న దొంగతనాలు చేయటానికి సైతం వెనుకాడట్లేదన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచుట కొరకు అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ నెంబర్ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగాఉంచబడతాయన్నారు.
రూరల్ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, దీని వలన ప్రజలకు మెరుగైన సేవలను అందించగలుగుతామని ఎస్, ఐ.మనోజ్ కుమార్ తెలిపారు.