Advertisements

ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంది : ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి*

*ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంది ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి

*వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

*  పనిచేసే అధికారులను ప్రోత్సహించండి డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి

* ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు
రూ. లక్ష విరాళం :స్వచ్ఛాంధ్ర సంస్థ ఛైర్ పర్సన్  దేవసేనమ్మ

* గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కు 50వేల రూపాయలు విరాళం అందించిన మాజీ ఎమ్మెల్యే పాశం

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ల సంక్షేమ నిధికి 50వేల రూపాయలు విరాళం

ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. బుధవారం గూడూరు ఆషిక్ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర, రెయిన్ డ్రాప్ అధినేత హరి కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా నూతన అసోసియేషన్ ఏర్పాటవడం సంతోషదాయకమన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండు కళ్లులాంటి వారన్నారు. వాస్తవాలను రాస్తూ సమాజంలో గుర్తింపు సాధించాలని సూచించారు. ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కు 50వేల విరాళం అందించామన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా 50 వేల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు.స్వచ్ఛాంధ్ర ఛైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వేర్వేరుగా యూనియన్లు ఏర్పాటు చేసుకోడం, వారి హక్కుల సాధనకు, సంక్షేమానికి పాటుపడడం హర్షణీయమన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు తనవంతుగా లక్ష రూపాయలు విరాళాన్ని సభికుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు.డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీగా పనిచేసే అధికారులను పాత్రికేయులు ప్రోత్సహించాలన్నారు. రాసే ప్రతి అక్షరం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వైసీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యను వార్తలుగా మలిచి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ల సంక్షేమ నిధికి 50వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. అనంతరం ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్, జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్, ఉపాధ్యక్షులు మీజూరు మల్లికార్జున రావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్, జనసేన నాయకులు నయీమ్ మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను అతిథుల చేతులమీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. శివ కుమార్, కే. సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు ప్రభుదాస్, సతీష్, సహాయ కార్యదర్సులు సయ్యద్ సలీం, స్వామి దాస్, కోశాధికారి యాక్ట్ శ్రీను,కమిటీ సభ్యులు సుభాన్ ,సచిన్, సిరాజ్,ఖాదర్,హాషిం , ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This