గూడూరు మండలం చవటపాలెం గ్రామం లో ఎటువంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న 33 సంవత్సరాలు వయసు గల వెంపులూరు .బాలకిషోర్ అనే వ్యక్తిని రూరల్ ఎస్ ఐ .మనోజ్ కుమార్ అరెస్ట్ చేశారు .
అతని వద్ద నుండి సుమారు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 180 ఎంఎల్ సీసాలు-30, మొత్తం 30 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఏస్ ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ , ఏటువంటి లైసెన్స్ లేకుండా మద్యం అమ్ముతున్నా, నిషేధిత మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న, నాటు సారాయి ,గంజాయి కోడిపందాలు, పేకాట వంటి చర్యలకు పాల్పడితే సహించబోమని ,
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించరు.