Advertisements

ఘనంగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సదస్సు

జర్నలిస్టుల సంక్షేమానికి  సహకరిస్తాం : మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికా విలేకరుల పాత్ర ప్రశంసనీయం : జెడ్పీటీసీ ఊటుకూరు యామిని
జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం, విలువలు, వ్యక్తి గత సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి :  ఆర్టీఓ ఆదినారాయణ



గూడూరు :
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గురువారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సదస్సు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్. జమాలుల్లా అధ్యక్షతన విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, జెడ్పీటీసీ ఊటుకూరు యామినిలు, విశిష్ట అతిధిగా ఆర్టీఓ గంగవరపు ఆదినారాయణ, ప్రత్యేక ఆహ్వానితులుగా రూరల్ సీఐ దశరథరామారావు, శ్రీయా రియల్ ఎస్టేట్ ప్రతినిధి బాలాజీ, తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్.కాలేషా, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.

ఆహ్వానితులు ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు 10 లక్షలు రూపాయలు భద్రతతో పోస్టల్ ప్రమాద భీమా కార్డులను అందించారు. తొలుత దివంగతులైన జర్నలిస్టులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధులన్నారు. వాస్తవాలకు ప్రాధాన్యత ఇస్తూ విలువలకు పెద్ద పీట వేయాలన్నారు. పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. గూడూరు అభివృద్ధికి పాటుపడాలని కోరారు. పార్టీలకతీతంగా పక్షపాతం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు వార్తలు రాయడంలో సహకరించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ కు 50 వేల రూపాయలను తన సొంత నిధులను ఇస్తామని సభికుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. ఈ హామీ ప్రకటించడం తో ఆయనకు ప్రింట్ మీడియా అసోసియేషన్ కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీఓ గంగవరపు ఆదినారాయణ మాట్లాడుతూ నిత్యం వృత్తి బాధ్యతలతో పని ఒత్తిడిలో ఉండే విలేకరులు వ్యక్తి గత జీవన భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాన్నారు. విలువలతో కూడిన జర్నలిజంతోనే స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకూ అనేక సంస్కరణలు సాధ్యమయ్యాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు రవాణా శాఖకు సహకరించాలని సూచించారు. జడ్పి టీసీ ఊటుకూరు యామినీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికా విలేకరుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విలేకరుల శ్రమ ఆదర్శనీయమన్నారు. రూరల్ సీఐ దశరథ రామారావు మాట్లాడుతూ ప్రజల కష్టాలను, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం, వారి సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టడంలో పత్రికా విలేకరుల సహకారం అభినందనీయమన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రింట్ మీడియా అసోసియేషన్ దీర్ఘకాలం కొనసాగి గూడూరు పత్రికా విలేకరుల సంక్షేమ కార్యక్రమాలు విరివిగా కొనసాగాలని ఆకాంక్షించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జర్నలిజంలో కొనసాగుతున్న పాత్రికేయ మిత్రులను అందరినీ గౌరవించుకునేలా అసోసియేషన్ నిర్మాణం చేపట్టడం అభినదించదగిన సంస్కృతి అన్నారు. గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జమాలుల్లా సభాద్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి ఉడతా శరత్ యాదవ్ వందన సమర్పణతో సదస్సు ముగిసింది. జామాలుల్లా,ళమీజూరు మల్లిఖార్జునరావు, శరత్ యాదవ్ లు మాట్లాడుతూ గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరుల ఐక్యత, పత్రికా విలేఖరుల హక్కుల సాధన, విలువలు పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని ఉద్గాటించారు. ఈ సమావేశానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అసోసియేషన్ ప్రతినిధులు నివాళులు అర్పించారు. అదేవిధంగా దివంగత జర్నలిస్ట్ లకు నివాళులు అర్పించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలోజెడ్పీటీసీ ఊటుకూరు యామిని, శ్రేయ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ మేనేజర్ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులురెడ్డి,
టీడీపీ పట్టణ, రూరల్ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండీ. అబ్దుల్ రహీం, ఇజ్రాయెల్ కుమార్, పల్లి కోటేశ్వరరావు,
ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, పూల చంద్రశేఖర్, రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ కొణిదెల మునిగిరీష్, అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్, సీపీఐ నాయకులు షేక్ కాలేషా, సీవీఆర్. కుమార్, ఎంబేటి చంద్రయ్య, బీసీ నాయకులు నాశిన భాస్కర్ గౌడ్, వైసీపీ నాయకులు జీ. జలీల్, బట్టా గోపి, కాంగ్రెస్ నాయకులు మోదూరు శ్రీనివాసాచారి, మైనారిటీ నాయకులు జీలానీబాష, ఆర్ఎస్కే జీలానీ, ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సీహెచ్. సునీల్ కుమార్, శివతోపాటు, వివిధ పత్రికలు, మీడియా ఛానెళ్ల మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This