బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీస్ అధికారులకు లేదు, స్థానిక MRO కి మాత్రమే ఉందన్నా మాజీ ఎమ్మెల్యే పాశిం.సునిల్ కుమార్ . ఈ రోజు పార్టీ ఆపీసుల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నియోజకవర్గం లోని పోలిస్ అధికారులు మానాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి బైండ్ ఓవర్ కింద మీరు స్టేషన్ కి రండి , మీ గ్రామం నుండి 10 మంది పేర్లు ఇవ్వండి అని అడగటం సరికాదున్నారు
బైండ్ ఓవర్ కీ ఫోన్ చేసి పిలవాల్సి వస్తే మండల పరిధిలోని తహసీల్దారు కి మాత్రమె అధికారం ఉంది ని పోలిస్ వారు ఎందుకు కాల్ చేసి రమ్మంటున్నారుఅని ప్రశ్నించారు. అయిన ఎలెక్షన్ కి ఇంకా సమయం 3 నెలలు ఉంది ఇప్పుడు బైండ్ ఓవర్ కి రమ్మని పిలవడం ఏంటి అని అన్నారు.అసలు ఏ పార్టీ నాయకుడునైన, కార్యకర్తనైనా పోలిస్ వారు పిలిచే అధికారం లేదు, MRO నోటిస్ ఇచ్చి పిలవాలి అంతేగాని పోలిస్ అధికారులకు అధికారం లేదుని గుర్తు చేసారు.
ఇలా చేస్తే మాత్రం మేము మీ పై అధికారులకు ,ఎలెక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు.
పోలీస్ వారు చేసిన నాయకులు కార్యకర్తలు ఎవరు వెళ్ళొదు, నోటిస్ అందించమని చెప్పండి అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్,కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి,పట్టణ మండల పార్టీ అద్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు,జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నాయకులు వి శివ కుమార్ ,దువ్వూరు రవీంద్ర రెడ్డి,ఇస్రాయెల్ కుమార్,MD అబ్దుల్ రహీం, ఏసుపాక పెంచలయ్య,నట శేఖర్, నియోజకవర్గ లీగల్ సెల్ అద్యక్షులు దాసరి సురేష్ చైతన్య , యువత వేములసునీల్,సందీప్,
సాయి రాజు , యువ నాయకులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.