Advertisements

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో అనారోగ్యం బారినపడి చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గం పాగలికి చెందిన ఎనుకుల మోక్షిత్ కి 1.5 లక్షలు, గూడూరు నియోజకవర్గం యాకసిరికి చెందిన దువ్వూరు శ్రీహరి రెడ్డి కి 2.7 లక్షలు, సూళ్లూరుపేట నియోజకవర్గం అన్నమేడుకి చెందిన వాకాటి సునీల్ కుమార్ రెడ్డికి 5.0 లక్షలు, గూడూరు నియోజకవర్గం గునపాటిపాలెంకి చెందిన వేదం బాలచంద్రకి 1.2 లక్షలు, సూళ్లూరుపేట నియోజకవర్గం దామానెల్లూరు కి చెందిన పారంశెట్టి రామయ్యకి 70 వేలు, సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురానికి చెందిన వెట్టి కృష్ణయ్యకి 3.5 లక్షలు మొత్తం రూ.14 లక్షల 60 వేల రూపాయల విలువగలిగిన చెక్కులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అందజేశారు. చెక్కులు అందజేసిన అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ దేశంలో కనివిని ఎరుగని రీతిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య సేవలు పొందేవిధంగా పరిమితిని పెంచడం గొప్ప విషయమని అన్నారు. ఆరోగ్యశ్రీ వర్తింపజేయడమే కాకుండా వర్తించని వారికి కూడా ఇలా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందించడం ఇలాంటి కార్యక్రమాలలో ఒక ప్రజా ప్రతినిధిగా నేను భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది అన్నారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొంటున్నారని. ఇలాంటి గొప్ప నిర్ణయాలతో ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి కొలువై ఉన్నాడని ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో ఎన్నిక కానున్నారని అన్నారు.

Leave a Comment

You May Like This