Advertisements

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణం నందు కొండూరు సునీల్ రెడ్డి, వాకాడు జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, చిల్లకూరు  జడ్పీటీసీ మన్యం శీనయ్య, మరియు మనుబోలు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే  వెలగపల్లి వరప్రసాద్ రావు  మరియు స్థానిక ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్  ముఖ్య అతిధి గా విచ్చేసి అంగరంగా వైభవంగా నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు భారీ కేక్ కట్ చేసి చేసిన ఎమ్మెల్యే  అనంతరం పేద ప్రజలకి చికెన్ బిరియాని తో అన్నదానం చేశారు, హాస్పిటల్ నందు సుమారు 300 మంది కి పైగా బ్లడ్ డొనేషన్ ఇప్పించడం జరిగింది.
అనంతరం కోడూరు మీరా రెడ్డి  ఆధ్వర్యంలో రోగులకి దుప్పట్లు, బ్రేడ్, అరటిపండ్లు మొదలుగు సామాగ్రిని అందచేయడం జరిగింది..
టౌన్ అధ్యక్షతన టవర్ క్లాక్ సెంటర్ లో అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే  తో కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్  హాజరైయి విజయవంతం చేయడం  జరిగింది తర్వాత గూడూరు పట్టణం అల్లూరి ఆదిశేషారెడ్డి గ్రౌండ్ నందు మొక్కలు నాటే కార్యాక్రమం లో పాల్గొన్నారు.
అనంతరం సంగం థియేటర్ సెంటర్ నందు గార వంశీ ఆధ్వర్యంలో యువతతో కలిసి కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు  మరియు ఎమ్మెల్సీలు. పాల్గొన్నారు.8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు.. వరుసగా రెండోసారి..ఇకపై అన్ని పాఠాలు…ఎమ్మెల్యే వరప్రసాద్ రావు
పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధ సీబీఎస్ఈ మొదలు ఐబీదాకా అడుగులు పడుతున్నాయి. విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో సీట్లు అయినా, ఉపాధి అయినా సులభంగా దక్కించుకునే అవకాశం.ఉందన్నారు
నేడు గూడూరు పట్టణంలోనే జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు గూడూరు నియోజకవర్గం సంబంధించి ఏడో తరగతి నుండి 8వ తరగతి కు వచ్చిన విద్యార్థులకు ఏపి సీఎం..దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ దాదాపు 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకూరానుందన్నార 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9,10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందజేస్తున్నారు
ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256GB కి పెంచి మరీ అందిస్తున్నారు ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ గారు, స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్ పర్సన్ పోనక దేవసేనమ్మ  వైసిపి పార్టీ సీనియర్ నాయకులు బత్తిన విజయ్ కుమార్  మరియు పలువురు ప్రముఖ వైసిపి పార్టీ నాయకులు జెసిఎస్ కన్వీనర్ లో విద్యాశాఖ సంబంధించిన అధికారులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు..,

Leave a Comment