తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఈ రాష్ట్రనికి జగనే సీఎం ఎందుకు కావాలి అనే కార్యక్రమం రెండో పట్టణ పరిధిలోని 19వ సచివాలయంలో సచివాలయ కన్వీనర్ వినేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆధితులుగా ఎమ్మెల్యే వరప్రసాద్ గా విచ్చేశారు. సచివాలయ కన్వీనర్ వినేష్ యాదవ్ ఏర్పాటు చేసిన వార్డు అభివృద్ధి పనుల డిస్ ప్లే బోర్డ్ ను ఆవిష్కరించారు . అనంతరం సచివాలయం సమీపంలో వినీష్ యాదవ్ ఏర్పాటు చేసిన వైసిపి జెండాను ఆవిష్కరించారు. ఇదే క్రమంలో ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మ దినం పురస్కరించుకుని.
వినీష్ యాదవ్ భారీ ఏర్పాట్లు చేసారు. బారికేక్ ను ఎమ్మెల్యే వినీష్ యాదవ్ కట్ చేసి ప్రజలకు పంచి పెట్టి శుభాకాంక్షలు తెలపారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా కన్వీనర్ వినీష్ యాదవ్ దాతృత్వంతో సుమారు 100 బకెట్లను వార్డు ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా వాలంటరీ వ్యవస్థ ను ఏర్పాటు చేసి ప్రజలకు పథకాలు అందిస్తున్నారన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోఅమలుపరుస్తున్నారన్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి కన్వీనర్ రాఘవరెడ్డి,వైసిపి నాయుకులునర్సయ్య,జువ్వయ్య,వెంకటేశ్వర్లు,గోపాలయ్య,మనోజ్,మురళి,వేణు,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.