Advertisements

(80) కేజీల గంజాయి ని

2 కార్లు ను పట్టుకొన్న సెబ్ సి ఐ .పి. విజయ్ కుమార్ .గూడూరు.

తిరుపతి జిల్లా SP . P. పరమేశ్వర్ రెడ్డి  మరియు తిరుపతి జిల్లా DSEO (ASP, SEB) అధికారి అయిన A.రాజేంద్ర  ఆదేశాల మేరకు
గంజాయి కేసులు పై దాడలు నిర్వహణలో భాగంగా బుధవారం19.12.2023  మధ్యాహ్నం 2.30 గంటల నుంచి చిల్లకూరు మండల పరిధిలోని బూధనం టోల్ ప్లాజా వద్ద NH16 పైన గూడూరు SEB టీమ్ వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.ఈ వాహనాల తనిఖీల్లో  అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి (80) కేజీల గంజాయిని మరియు (02) కార్లను సీజ్ చేయడం జరిగింది.
ముద్దాయిల వివరాలు:

ఎ1)పి.ప్రశాంత్ రెడ్డి.
S/oయాదవిరిరెడ్డి,
వయస్సు.30 సంవత్సరాలు,
R/o హస్తినాపురం,
హైదరాబాద్.
  A2) బొంత.
  పరమేష్,
స/ఓ రామచంద్రుడు,
వయస్సు: 33 సంవత్సరాలు,
కులం: వడ్డెర,
R/o బోడుప్పల్,
హైదరాబాద్,

A3) బొంత ప్రసాద్,
s/o వెంకటయ్య,
వయస్సు 31 సంవత్సరాలు,
కులం.వడ్డెర,
నల్గొండ పట్టణం,
తెలంగాణ రాష్ట్రం.
A5)గోలుసుల.  నరేష్, S/o అంజయ్య, వయస్సు: 37సం, కులం: వడ్డెర, R/o పల్లెపాడు గ్రామం, నార్కెట్‌పల్లి మండలం,
నల్గొండ జిల్లా.తెలంగాణ రాష్ట్రం.విచారణలో  గతంలో 
పలు కేసుల్లో  ముద్దాలు గా గుర్తించారు .   ఐదుగురు వ్యక్తులను  80 కేజీల గంజాయి గురించి  విచారించగా వారు బదులిస్తూ మేము గత కొన్ని సంవత్సరంలు నుండి స్నేహితులమని ,   సదరు గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంనకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం అడ్డరోడ్డు వద్ద  అప్పన్నఅనే వ్యక్తి వద్ద మొత్తం (4 )లక్షల రూపాయలకు (80) కేజీల గంజాయిని కొనుగోలు చేశామని , సదరు గంజాయిని  కర్ణాటక రాష్ట్రంలోని రామ్ నగర్ జిల్లా నందలి చెన్నపట్నం వద్ద సుమారు  షబ్బీర్  అనే వ్యక్తికి అమ్ముతామని , లాభాన్ని  ఐదుగురు స్నేహితులమూ సమంగా పంచుకుంటామని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ గంజాయి మార్కెట్ ధర సుమారు (16) లక్షలు ఉంటుందని అంచనా.

కార్ల వివరాలు:
————-
1) గ్రే కలర్ మారుతి సుజుకి డిజైర్ కారు (TS 07JF 2455)  2)మారుతి సుజుకి బలెనో కారు (TS 07 JP 4770)
——————
ఈ దాడులలో పాల్గొన్న గూడూరు  SEB టీమ్ వారు:
గూడూరు SEB టీం;
(1)CI ,P విజయ్ కుమార్,
(2)SI, A శేషమ్మ,
(3)HC M కిరణ్ సింగ్
EC’S :– P.రమేష్ , VN ప్రసాద్, M. కృష్ణయ్య, SK.భాష,TG ఆనందబాబు,G. రామ్ ప్రసాద్ .
వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.
—————————————————————–
గత రెండు సంవత్సరముల కాలంలో గూడూరు SEB టీమ్ గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించి, (51) కేసులు నమోదు చేసి, (108) మందిని అరెస్టు చేయడం జరిగింది. మరియు (642) KG ల గంజాయిని, 4 కార్లను సీజ్ మరియు ఒక ద్విచక్ర వాహనం ను సీజ్   చేసినారు. గంజాయికి పేరుబడ్డ అరుంధతి పాలెం లో విస్తృతంగా దాడులు నిర్వహించి, అక్కడ గంజాయిని పూర్తిగా నియంత్రించాము. భూదనం టోల్ ప్లాజా వద్ద నిత్యం దాడులు నిర్వహిస్తూ NH 16 పైన గంజాయి రవాణాను నిరోధిస్తున్నాము.
గంజాయి నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టాము (1)బైండోవర్ కేసులు15 నమోదు చేయడం (2) హిస్టరీ షీట్స్14 తెరవడం (3) మార్గద్రవ్యాలు మరియు మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై విస్తృతంగా  అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో  మరియు ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు,
(4) మారకద్రవ్యాల వలన కలిగే నష్టాలను తెలియజేస్తూ మరియు నేర సమాచారాన్ని అందించడానికి  ప్రజల్లో చైతన్యం తెచ్చేలా  గూడూరు పట్టణంలో జన సమర్థ ప్రాంతాల్లో , కాలేజీ ప్రాంగణాల్లో  18  హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.   అలాగే మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు మరియు ప్రజలకు చైతన్యపరిచేలా పాంప్లెట్స్ పంచడం, కాలేజీల్లో  డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీల ఏర్పాటు చేశారు., ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది.నేర సమాచార సేకరణకై ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్( 14500) కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాము. గంజాయి వంటి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవచ్చును.                          P.Vijay Kumar,
                          Enforcement Inspector,
Special Enforcement Bureau Station,
                         Gudur

Leave a Comment

You May Like This