Advertisements

వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి
గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్

వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్ విధిగా కలిగి ఉండాలి
గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్


ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు తప్పని సరిగా డ్రైవింగు లైసెన్సు కలిగివుండాలని లేని పక్షంలో జరిమానా తప్పదని గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం గూడూరు రూరల్ పరిధిలో హైవేలో వాహనాల తనిఖీ చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహన చోదకులకు కౌన్సిలింగు నిర్వహించారు.లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలుతీసుకొంటామన్నారు .మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు .వాహనదారులు అన్నీ రకాల అనుమతి పత్రాలు కల్గి వుండాలని కోరారు .లైసెన్స్ లేని వారికి, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Leave a Comment