అష్ఫాఖుల్లా, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆశయ సాధనకు కృషి
త్యాగధనులను పాఠ్యాంశాల్లో చేర్చాలి
ఘనంగా అష్ఫఖుల్లా ఖాన్, బిస్మిల్ వర్థంతి వేడుకలు
గూడూరు : స్వాతంత్ర్య సమరయోధులు అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ ల 96వ వర్థంతి వేడుకలను గూడూరు పట్టణంలోని షాదీమంజిల్ లో మంగళవారం ఇన్సాఫ్ సమితి, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు షేక్. కాలేషా, మగ్దూమ్, ఎండీ. అన్వర్ బాష, మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశంకోసం త్యాగం చేసిన ఘనత అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ కే దక్కిందన్నారు. యువత వారి ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. రైతు సంఘం నాయకులు సీవీఆర్. కుమార్, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్. జమాలుల్లా మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ నిలిచారన్నారు. యువత మతోన్మాద రాజకీయ నాయకులకు చమరగీతం పాడాలన్నారు. రానున్న ఎన్నికలలో లౌకిక పార్టీల పక్షాన నిలబడి పోరాడాలన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ లకు అదే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ మైనారిటీ నాయకులు షేక్. కాలేషా, ఎండీ. మగ్ధూమ్ మొహిద్దీన్, ఇన్సాఫ్ సమితి గౌరవాధ్యక్షులు ఎండీ. అన్వర్ బాష, రైతు సంఘం నాయకులు సీవీఆర్. కుమార్, డివిజన్ నాయకులు మహబూబ్ అలీ, పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఛైర్మన్ మీజూరు మల్లికార్జున్ రావు, సెక్రటరీ శానాటి సుధీర్, సంధాని భాయ్, ఇన్సాఫ్ ఎన్ఆర్ఐ సెక్రటరీ షేక్ ఇలియాజ్, యస్థాని, యూసుఫ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.