నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నందు జరిగిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంకి సంబంధించి మరిన్ని మెరుగులు దిద్దుతూ రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల కుటుంబాలకు 4.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలు కల్పిస్తున్న గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీ,అలాగే లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేయించడం ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి,ఎక్కడికి వెళ్ళాలి,ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి,ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతి ఇంట్లో నివృతిచేసే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమంలో నెల్లూరు కలెక్టరేట్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీబల్లి కళ్యాణ్ చక్రవర్తి.
ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి, ప్రజలమనిషి, నిరంతరం ప్రజలకోసమే జీవించే మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నే మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చేసుకోవాలి అని పిలుపు నిచ్చిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.
జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు ఆలోచన లను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి,ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఒక కార్యకర్తలాగా పనిచేస్తానని చెప్పిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతీ వైసీపీ నాయకుడు, కార్యకర్తలు అందరూ అహర్నిశలు పనిచేసి జగన్ మోహన్ రెడ్డి ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్న తరువాత మాత్రమే విశ్రామించాలి అని పిలుపు నిచ్చిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం,సహకార,మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆనం అరుణమ్మ ,ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ,ఎస్.పి తిరుమలేశ్వర్ రెడ్డి,,నెల్లూరు నగర మేయర్ స్రవంతి,,డి.యం & హెచ్.ఓ ,నెల్లూరు జిల్లా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.