Advertisements

అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటాం


కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
పంటా శ్రీనివాసులురెడ్డి


గూడూరు : అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటామని
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. సచివాలయ సిబ్బందితో అంగన్వాడి పాఠశాలలను నడిపించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని వెల్లడించారు. తుఫాను బాధితుల కు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పూల చంద్రశేఖర్ , వేమయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, సిద్ధయ్య, మూర్తి పాల్గొన్నారు.

Leave a Comment