ఏర్పేడు ( డిసెంబర్ 15) మేర్లపాకగ్రామపంచాయతీ ఎస్టీ కాలనందు మిచాంగు తుఫాన్ వలన కురిసిన భారీ వర్షాలకు ఎస్టీ కాలనీ నందు ఐదు ఇండ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తుఫానుకు పాక్షికంగా, పూర్తిగా లేదా పాత ఇల్లు గోడలు కూలిన లేదా, దెబ్బతిన్న వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో అమల ప్రకారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పేడు మండల వైసీపీ ఇన్చార్జి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 2500 రూపాయలు చొప్పున నగదును ఇప్పించడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్సు , ప్రజలు పాల్గొన్నారు.