Advertisements

డిసెంబర్ 19 న ఛలో నెల్లూరు జైహో 2వ జాతీయ సమ్మేళనాన్నీ జయప్రదం చేయండి

ఏర్పేడు ( డిసెంబర్ 15)…
డిసెంబర్ 19 న ఛలో నెల్లూరు జైహో 2వ జాతీయ సమ్మేళనాన్నీ జయప్రదం చేయండి
తిరుపతి జిల్లా *ఏర్పేడు అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జైహో 2వ జాతీయ సమ్మేళనం పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది.నెల్లూరు పట్టణ సమీపాన పెన్నానది తీరాన పల్లిపాడు గ్రామంలో 102 సం.ల క్రితం మహాత్మా గాంధీ స్వహస్తాలతో ప్రారంభమైన పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో అష్ఫాక్ – బిస్మిల్ అమరత్వ దినమైన 2023 డిసెంబర్ 19 (మంగళవారం) న దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న ప్రతినిధులతో జైహో 2వ జాతీయ సమ్మేళనం జరుగుతుందని, జాతీయోద్యమ స్ఫూర్తితో జాతిని ఏకం చేసేందుకూ, మతోన్మాదాల్ని నిర్మూలించేందుకు జాతీయ స్థాయిలో నిర్మాణమౌతున్న మహోద్యమం ఈ జైహో అని తెలిపి,ఈ సమ్మేళనానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాము.

ఈ కార్యక్రమంలో జై భారత్ , జై హో కార్యకర్తలు మహేష్, రాబర్ట్ ,బాలసుబ్రమణ్యం, సురేష్, పోస్టర్ ఆవిష్కరణను
“జైహో జైహో హిందూ-ముస్లిం ఎక్ హో”…జైహో జైహో సబ్ హిందుస్తానీ ఎక్ హో”అనే నినాదంతో పత్రిక ఆవిష్కరణ జరిగింది.

Leave a Comment