Advertisements

నెల్లూరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి నిర్వహణ.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు నెల్లూరు మార్కెట్ కమిటీ(AMC )ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు AMC చైర్మన్ శ్రీ పెర్నేటి కోటేశ్వర రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ సభ్యులు మరియు సిబ్బంది సమక్షంలో ఘన నివాళులు అర్పించారు.మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆనాడు మద్రాసు రాష్ట్రం నుంచి సెపరేట్ గా ఏర్పాటు చేసేకి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. హరిజనులు గిరిజనులు అభివృద్ధి కోసం ,,దళితులు ని ఆలయాల ప్రవేశం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అందులో భాగంగానే నెల్లూరు లోని వేణుగోపాల స్వామి ఆలయంలోకి దళితులు ప్రవేశం కోసం పోరాటం చేసి విజయం సాధించారు. చిన్న వయసులోనే భార్య ,బిడ్డని కోల్పోయారు. జీవితం మీద విరక్తి తో ఉన్న పొట్టి శ్రీరాములు గారికి గాంధీ గారి స్వాతంత్ర్య ఉద్యమాలు పోరాట స్ఫూర్తిని ఇచ్చాయి. అప్పటి నుంచి గాంధీ గారితో అనేక స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్నారు. అనేక సార్లు జైలుకు వెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమం లో కూడా పాల్గొన్నారు. భాషాప్రాతిపధికన,, ప్రాంత ప్రాతిపదికన మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. 56 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి శ్రీ పొట్టి శ్రీరాములు 1953 డిసెంబర్15 న మరణించారు. ఆయన మరణానంతరం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆనాటి ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ ఆయన కృషి కి గుర్తింపు గా ప్రత్యేక ఆంధ్ర రాష్టం ఏర్పాటు చేశారు.ఇలా సమాజం అభివృద్ధి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాలను కృషిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చైర్మన్ గారు పొట్టి శ్రీరాములు గారి గొప్పతనాన్ని మిక్కిలి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ ఉమాపతి రెడ్డి ,, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటిపర్తి వెంకటేష్,,అసిస్టెంట్ సెక్రెటరీ నవీన్ కుమార్ ,,ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment