Advertisements

శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ఏర్పేడు ( డిసెంబర్ 14).. దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీస్వామి నారాయణ అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠం నిర్మాణానికి గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం, వికృతమాల గ్రామంలో భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం,తిరుపతి,పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి  శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ట్రస్ట్ వారు తెలియజేసిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం లో శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ట్రస్ట్ వారి ఇంటర్నేషనల్ స్కూల్ రావడం మన పిల్లల అదృష్టమని తెలిపారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి  త్వరలోనే పాఠశాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలాగే ఇంటర్నేషనల్ పాఠశాలలో కేజీ నుండి 12వ తరగతి వరకు ఉంటుందని అలాగే వసతి గృహం, ఇండోర్ ఔట్డోర్ క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్ ,డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, మాథ్స్ ల్యాబ్ ,యాక్టివిటీ రూమ్ ,ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్, ఓపెన్ థియేటర్ మొదలైన వాటిని వాటిని నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ ప్రధాన స్వామీజీ మహంతు సాదు, దేవప్రసాద్ దాస్,సాదు శుక్ల వల్లభ దాస్,సాదు నిత్య స్వరూప దాస్,కిషోర్ రెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్,లక్కమనేని కృష్ణ, బత్తి శెట్టి, దాము యాదవ్, మునరత్నం నాయుడు, శేఖర్ నాయుడు, మునిశేఖర్ రెడ్డి, కేశవరెడ్డి, రామ్మూర్తి ,ఘరాటారెడ్డి, బాలిరెడ్డి, శేఖర్ రెడ్డి,వెంకట రామానాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment