????????ఆర్డివో కిరణ్ కుమార్ చెప్పాడంటే.. చేస్తాడంతే…
???????? కోట లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఆర్డివో కిరణ్ కుమార్
????????శిథిలావస్థలో కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు తరగతి గదులు
???????? అప్పటికే..ఉన్నత పాఠశాలలో గుంటలు ఉండటం తో వల్ల వర్షం నీరు నిలిచే పరిస్థితి
????????కోట అభివృద్ధి లో భాగంగా రెండు తరగతి గదులు తొలగించిన ఆర్డివో..
????????గదుల తొలగింపు లో వచ్చిన రబీష్ తో పాఠశాలలో గుంటలు పూడ్చి ఎత్తు లేపిన పరిస్థితి
???????? వెను వెంటనే ఆర్డివో దాతృత్వం లో తరగతి గదులను తొలగించిన ప్రాంతం లో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి
????????పనులు వేగవంతం గా సాగుతున్న తరుణంలో అభివృద్ధి కి అడ్డంకులు కలిగించిన నాయకులు
???????? 3 నెలలు గా కోటలో ఆగిపోయిన అభివృద్ధి పనులు
????????ఈ తరుణం లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో జరుగున్న అభివృద్ధి నిలిచి పోయింది
???????? మధ్య లో ఆగిపోయిన పనులు వల్ల రాళ్లు గుచ్చుకుంటూ అవస్థలు పడుతున్న ఆడపిల్లలు
????????ఆడపిల్లలు పడుతున్న బాధ వర్ణతీతం
???????? ఏ ఒక్క నాయకుడు పట్టించుకొనే పాపానికి పోలేదు
???????? ఆడబిడ్డలు పడే కష్టాలు పై షోషల్ మీడియా, పలు పత్రికల్లో వరుస కధనాలు
???????? అయినా కుడా స్పందించని నాయుకులు
???????? ఆడపిల్లలు పడే బాధలు చూడలేక మళ్ళీ రంగలోకి దిగిన ఆర్డివో
???????? గత శనివారం యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టిన ఆర్డివో
????????4 రోజుల్లో పాఠశాలలో కాంక్రిట్ గచ్చు పనులు పూర్తి చేసిన ఆర్డివో
???????? కాంక్రిట్ గచ్చు కు మూడు లక్షల రూపాయలు నిధులు ఖర్చు
????????220కట్టలు సిమెంట్, 12యూనిట్లు కంకర,12యూనిట్లు ఇసుక తో కాంక్రిట్ గచ్చు
???????? 4రోజుల పాటు రోజూ 5మంది బేల్దారులు,20మంది మిల్లర్ కార్మికులు, రెండు వాటర్ ట్యాంక్ లతో పనులు పూర్తి
???????? ఆర్డివో కిరణ్ కుమార్ పనులు అట్లుంటాయ్ మరి
????????ఆర్డివో కిరణ్ కుమార్ చెప్పాడంటే.. చేస్తాడంతే…
????????థాంక్యూ కిరణ్ కిరణ్ మామయ్య… మీ మేలు ఈ జన్మకిమరువలేము :విద్యార్థినిలు
???????? హర్షం వ్యక్తం చేసిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినిల తల్లితండ్రులు, సిబ్బంది
????????జయహో.. కిరణ్.. జయ జయహో కిరణ్ .. అంటున్న కోట ప్రజానీకం
ఆర్డివో కిరణ్ కుమార్ చెప్పాడంటే.. చేస్తాడంతే… తప్పు చేయడు తప్పు చేయనివ్వడు.. అందుకే అదరడు.. బెదరడు.. అభివృద్దే ఆయన లక్ష్యం,ప్రజల సంక్షేమమే ఆయన జెండా.. అజెండాగా ముందుకు దూసుకుపోతున్నారు. బంతిని ఎంత బలంగా నెలకు కొడితే అంత వేగంగా లేస్తుంది. అలాగే ఆర్డివో పై విమర్శలు చేస్తే అంత వేగంగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజా క్షేత్రం లోకి దూసుకుపోతారు.
ఆర్డివో కిరణ్ కుమార్ 2022 సెప్టెంబర్ లో గూడూరు సబ్ కలెక్టర్ ఆర్డివో పదవీ బాధ్యతలు చెపట్టారు. అ సమయంలో మాండస్ తుఫాన్ రావడం తో ప్రాణాలకు తెగించి ఎన్నో సాహసాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. తరువాత కోటలో అభివృద్ధి పనులు మొదలు పెట్టి చరిత్ర సృష్టించి ఒక్కసారి గా రియల్ హీరో,ప్రజాధికారి గా పేరు ప్రఖ్యాతలు గడియించారు.కోట ప్రజలుతో పాటు గూడూరు నియోజకవర్గం ప్రజలు ఆర్డివో కు బ్రహ్మరధం పట్టారు.
అతి తక్కువ సమయంలో ఆర్డివో కిరణ్ కుమార్ ప్రజలకు చేరువయ్యారు. కారణాలు లేకపోలేదు ఎవ్వరి ఊహలకు అందని విధంగా కోట్లాది రూపాయలతో కోటతో పాటు మ ల్లాం, వాకాడు తో పలు గ్రామాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.అతి తక్కువ సమయంలో ఆర్డివో కు ప్రజల్లో మంచి పేరు రావడం తో కొంతమంది రాజకీయ నాయుకులు కళ్ళు ఎరుపెక్కయి.
అంతే మాకు రానిపేరు ఆర్డివో కి రావడం ఏమిటి అంటూ ఆర్డివో విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఆర్డివో చేస్తున్న అభివృద్ధి పై విమర్శలు, అడుగు అడుగున అడ్డంకులు,ఏ విధంగనైనా ఆర్డివో చేస్తున్న అభివృద్ధినీ అడ్డుకోవాలని పద్మవ్యూహలు పన్ని చివరికి కోట లో జరుగుతున్న అభివృద్ధి పనులు అడ్డుకున్నారు. ఆయన ను బదిలీ చేయాలి విశ్వ ప్రయత్నం చేశారు. భగవంతుడు ఆర్డివో పక్షం నిలబడి ఆయన ను గూడూరు లోనే నిలిచేటట్లు చేశారు. అందుకొనేమో బాబోలు..మిచౌంగ్ తుఫాన్ లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి రియల్ హీరో అయ్యారు. వాకాడు మండలం, బాలి రెడ్డి పాళెం కు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ తీసుకోని వచ్చే ప్రయత్నం కేవలం ఆర్డివో కిరణ్ కుమార్ చేసిన రిస్క్యు ఆపరేషన్ కారణం అనీ చెప్పచ్చు..
నిలిచి పోయిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులు
ఆర్డివో చేస్తున్న చేస్తున్న అభివృద్ధి నీ అడ్డుకోవడం తో..కోటలో అభివృద్ధి ఆగిపోవడం తో పాటు ఆ సమయంలో కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో జరిగే అభివృద్ధి కుడా ఆగిపోయింది. కోట క్రాస్ రోడ్డు నుండి గాంధీ బొమ్మ వరకు రోడ్డు ఆక్రమణలు తొలగించి సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు చేసి రెండు ప్రక్కల సిమెంట్ రోడ్డు వేయాలని ఆర్డివో రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా మెయిన్ రోడ్డు వద్ద నున్న శిథిలావస్థలో కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు తరగతి గదులు తొలగించారు. అప్పటికె గుంట గా ఉన్న పాఠశాల లో తొలగించిన తరగతి గదులు రభిష్ ను గుంట లో పోసి లెవలింగ్ చేసి కాంక్రిట్ గచ్చు వేయాలి అనీ సిద్ధం చేశారు.
తొలగించిన తరగతి గదులు స్థానం లో ప్రహరీ నిర్మించారు. అప్పటికే పాఠశాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరుగుదొడ్లు లేవు, ఉన్న మరగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు, గేట్లు, ప్రహరీ లేదు, దీనికి తోడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉండటం తో అకతాయి లు వల్ల ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, పిల్లలకు భోజనాలు వండేందుకు గదులు లేని పరిస్థితి ఇలా ఎన్నో సమస్యలు ఉన్న ఒక్క నాయకుడు పట్టించుకొనే పాపాపని పోలేదు.
కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆగిన అభివృద్ధి తో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దింతో షోషల్ మీడియా, మీడియా, పత్రికల్లో వరుస కధనాలు, అయినా ఎవ్వరు స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. కారణం సొంత నిధులు తో పనులు చేపట్టాలి 5లక్షల రూపాయలు వరకు ఖర్చు అయ్యేపరిస్థితి, అందుకే ఎవ్వరు ముందుకు రాలేదు, చేయలేదు, మాటలు వేరు చేతలు వేరు కదా..
మరలా రంగంలోకి ఆర్డివో.. ఒక్క రోజుల్లో రూపు రేఖలు మార్పు
కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆగిన అభివృద్ధి తో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరలా ఆర్డివో కిరణ్ కుమార్ స్పందించి రంగంలోకి దిగి గత శనివారం పనులు మొదలు పెట్టి అభివృద్ధి పనులు వేగవంతం చేసి ఒక్క రోజులో పాఠశాల రూపు రేఖలు మార్చారు. పాఠశాల లో కాంక్రిట్ గచ్చు పనులు ప్రారంభించారు. ప్రహరీ పూత పనులు, గెట్ లు ఏర్పాటు, మరుగుదొడ్లు ఆధునికరణ, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కు దారి మల్లింపు ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఆర్డివో కిరణ్ కుమార్…
4రోజుల్లో 3లక్షల రూపాయలు ఖర్చు తో కాంక్రిట్ గచ్చు పూర్తి
కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రభిష్ తొలి గచ్చు వేసే సమయంలో పనులు ఆగిపోవడం తో ఆడపిల్లలు రాళ్ల పై నడవలేక ఇబ్బంది పడేవారు. షోషల్ మీడియా, పలు పత్రికల్లో కధనాలు వస్తున్న ఏ నాయకుడు స్పందించలేదు, కానీ ఆర్డివో మనస్సు చెలించి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనులు ప్రారంభించి మొదటి గా 3లక్షల రూపాయలు తో 220కట్టలు సిమెంట్, 12యూనిట్లు కంకర, 12 యూనిట్లు ఇసుక మరియు రోజూ 20మంది కాంక్రిట్ కూలీలు,5మంది బెలదార్లు, రెండు వాటర్ ట్యాంక్ లతో 4రోజుల్లో అద్భుతం గా కాంక్రిట్ గచ్చు పూర్తి చేశారు.
థాంక్యూ కిరణ్ మామయ్య… ఈ జన్మకు మిమల్ని మరువలేము
మూడు నెలలు నుండి రాళల్లో నడుస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న మా పై దయచూపి యుద్ధ ప్రాతికపదిన పాఠశాలలో కాంక్రి ట్ గచ్చు వేసి పాఠశాల ఆవరణలో వర్షం నీళ్లు నిలవకుండా గ్రావెల్ తొలి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కు దారి మల్లించి ఆక తాయి లు నుండి మాకు రక్షణ కల్పించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి గేట్లు ఏర్పాటు చేస్తూ ఆడపిల్లలు భద్రత కోసం మీరు చేస్తున్న సేవలు మేము ఈ జన్మకి మరువలేము.. థాంక్యూ కిరణ్ మామయ్య.. అనీ పాఠశాల విద్యార్థినిలు అన్నారు. అంతేకాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని తల్లితండ్రులు కుడా ఆర్డివో నీ అభినందనలు తెలిపారు.