తలనొప్పి-రకాలు మరియు వాటికి గల కారణాలు
All the Types of Headaches and What Causes Them
తలనొప్పి భుజం నుండి ప్రారంభమై మెడకు ఇరువైపులా మరియు పుర్రె బేస్ వద్ద ప్రారంభం అయి కణతల వరకు ఉంటుంది. తలనొప్పి అనేది అందరిలో సాధారణ వ్యాధి –అది చాలా వ్యాధుల యొక్క మొదటి లక్షణం. ఉదాకు : కొంతమందికి డిహైడ్రేట్ అయితే తలనొప్పి వస్తుంది, కొంతమందికి నిద్రపోకపోతే తలనొప్పి గా ఉంటుంది. కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటె తలనొప్పి వస్తుంది.
- ఉద్రిక్తత లేదా ఒత్తిడి/ టెన్షన్ వలన వచ్చే తలనొప్పి:
టెన్షన్ వలన వచ్చే తలనొప్పి అత్యంత సాధారణ రకాల్లో ఒకటి, ఇది సాధారణంగా చాలా గంటలు ఉంటుంది మరియు నుదిటి లేదా తల వెనుక భాగంలో తేలికపాటి నుండి మితమైన నొప్పిగా అనిపిస్తుంది, మెడ, భుజాలలో మరియు కళ్ళ క్రింద ఒత్తిడి ఉంటుంది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం ఇది మెడ మరియు భుజం కండరాలలో సంకోచం వల్ల ఒత్తిడి, నిద్ర లేకపోవడం వలన అలసట, ఆకలి లేదా ఎక్కువ కెఫిన్ వాడకం వలన లేదా మద్యం మరియు సిగరెట్ల దుర్వినియోగం వలన కలుగును.
సాధారణ నిద్ర, వ్యాయామం మరియు మంచి ఆహారపు అలవాట్లు, మెరుగైన భంగిమ మరియు చికిత్సతో దానిని నయం చేయవచ్చు. ఉద్రిక్తత తలనొప్పి కొన్ని గంటల కంటే ఎక్కువసేపు ఉండి, తీవ్రతరం చేసినప్పుడు, అది మైగ్రేన్. తలనొప్పి కావచ్చు. - మైగ్రేన్ తలనొప్పి:
మైగ్రేన్ తలనొప్పి మరింత తీవ్రంగా ఉండును – అది కణతలు , కన్ను లేదా తల వెనుక భాగంలో నొప్పి కలిగి ఉండును. వికారం లేదా కాంతి మరియు శబ్దానికి తలనొప్పి కలుగును. మైగ్రేన్ తలనొప్పి పురుషులతో పోలిస్తే మహిళల్లో రెండు, మూడు రెట్లు ఎక్కువ సాధారణం, “మెదడు యొక్క రక్త ప్రవాహం మరియు నరాల కణాల చర్యలలో మైగ్రేన్లు సంభవిస్తాయి. హార్వర్డ్ హెల్త్ ప్రకారం, 70% మైగ్రేన్ బాధితులలో జన్యుశాస్త్రం పాత్ర పోషిస్తుంది. మైగ్రేన్లు కూడా సాధారణంగా మారుతున్న వాతావరణం, హెచ్చుతగ్గుల నిద్ర విధానాలు, ఒత్తిడి మరియు ప్రకాశవంతమైన లైట్లు లేదా బలమైన వాసనలు వంటి వాటి వలన కలుగును.
హార్వర్డ్ హెల్త్ ప్రకారం, 20% మైగ్రేన్లు ““aura ప్రకాశం” అని పిలువబడే నాడీ సంబంధిత లక్షణాలతో ఉంటాయి, ఇందులో హలోస్, తాత్కాలిక దృష్టి కోల్పోవడం లేదా తిమ్మిరి మరియు శరీరానికి ఇరువైపులా జలదరింపు ఉంటాయి.
తరచూ మైగ్రేన్ కు గురయ్యే రోగులు నివారణ మందులు వాడి ప్రయోజనం పొందుతారు, ”అని హార్వర్డ్ హెల్త్ వివరిస్తుంది. - క్లస్టర్ తలనొప్పి:
క్లస్టర్ తలనొప్పి ఆకస్మికంగా ఉంటుంది, క్లస్టర్ తలనొప్పి సూది తో పొడిచినట్లు, ఒక కన్ను వెనుక నొప్పి కనబడుతుంది. అవి కనురెప్ప వాపు, ముక్కు కారటం లేదా కన్నువెంట నీరు కారటం కలిగి ఉంటాయి మరియు సాధారణంగా 15 నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటాయి. క్లస్టర్ తలనొప్పి రోజంతా వివిధ సమయాలలో సంభవిస్తుంది మరియు వారాలు లేదా నెలలు కొనసాగుతుంది.
క్లస్టర్ తలనొప్పి సమయంలో మద్యం మరియు సిగరెట్లను త్రాగరాదని వైద్య నిపుణులు సలహా ఇస్తారు మరియు తలనొప్పి యొక్క తీవ్రత మరియు పౌనపున్యానికి తగిన మందులను సూచించవచ్చు. - శ్రమ వలన తలనొప్పి:
రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, లేదా సెక్స్ వంటి పనుల వలన కలిగే శారీరక శ్రమ నుండి కూడా తలనొప్పి వచ్చును. శ్రమ తలనొప్పి తల అంతటా స్వల్పకాలిక నొప్పిగా ఉండును.
హెల్త్ లైన్ ప్రకారం ఔషధాలను ఉపయోగించడం ద్వారా లేదా శ్రమకు ముందు బీటా బ్లాకర్లను ఉపయోగించడం ద్వారా దానిని తగ్గించవచ్చు. - తిరిగి తలనొప్పి rebound headache:
తిరిగే తలకు దెబ్బ లేదా ఇతర గాయలవలన వస్తుంది. సర్వసాధారణం గా మందుల అధిక వినియోగం లేదా 15 రోజులకు మించి నొప్పి నివారణ మందులు తీసుకుంటే తిరిగే తలనొప్పి వచ్చును. దానివలన మీకు చంచలత, వికారం మరియు నిద్ర భంగం వంటి లక్షణాలతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
తిరిగే తలనొప్పిని నయం చేయడానికి, మీరు ఔషధ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. - సైనస్ తలనొప్పి:
సైనసిటిస్, లేదా సైనస్-వాపు వలన కలిగే, సైనస్ తలనొప్పి సీజనల్ మరియు ముఖంలో, ముక్కు యొక్క బ్రిడ్జ్ వద్ద, బుగ్గల్లో, లేదా దంతాలు మరియు దవడలలో కూడా తేలికపాటి మితమైన నొప్పికి కారణమవుతుంది – ఎక్కువగా అలెర్జీ లేదా జలుబు ఉన్నవారికి సైనస్ తలనొప్పి వచ్చును. తలనొప్పి సాధారణంగా దట్టమైన మ్యుకస్(చిమిడి) లేదా ముక్కు నోస్ బ్లాక్ వంటి లక్షణాలతో ఉంటుంది. నాసికా లక్షణాలు లేనట్లయితే, అది మైగ్రేన్ కావచ్చు.
నాసికా స్ప్రేలు సైనస్ తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. - కెఫిన్ తగ్గించడం వలన తలనొప్పి The caffeine-withdrawal headache:
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, కెఫిన్ వినియోగం రోజుకు 100 మిల్లీగ్రాముల కెఫిన్ కలిగి అంటే ఒక చిన్న కప్పు కంటే తక్కువగా ఉండాలి. కెఫీన్ మానివేసిన వెంటనే తలనొప్పి వస్తుంది. కెఫిన్ మెదడులోని రక్త నాళాలను పలుచన చేయును. అది త్రాగనప్పుడు మరియు అది లేనప్పుడు, రక్త నాళాలు విస్తరిస్తాయి మరియు పెరిగిన రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తాయి, ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. కెఫిన్ ఉపసంహరణ తలనొప్పి సాధారణంగా అలసట, ఏకాగ్రత కష్టం, వికారం మరియు కండరాల నొప్పితో ఉంటుంది.
కెఫిన్ ఉపసంహరణ తలనొప్పిని తగ్గించడానికి ఒక మార్గం – కెఫిన్ కలిగి ఉన్న నొప్పి నివారణను తీసుకోవడం ”అని హెల్త్ లైన్ నివేదించింది. “కెఫిన్ మీ శరీరం ఔషధాలను త్వరగా గ్రహించడంలో సహాయపడటమే కాదు, ఈ ఔషధాలను 40 శాతం మరింత ప్రభావవంతంగా చేస్తుంది.”
- రుతు మైగ్రేన్ The menstrual migraine
రుతుకాలం ప్రారంభమయ్యే ముందు, స్త్రీ శరీరం లో ఈస్ట్రోజెన్ పడిపోతుంది – ఈస్ట్రోజెన్ నొప్పి యొక్క అనుభూతితో సంబంధం ఉన్న మెదడులోని రసాయన భాగాన్ని నియంత్రించే హార్మోన్. ఈ సమయంలో చాలా మంది మహిళలు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు మాయో క్లినిక్ తెలిపింది. పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో తగ్గుదల ఉండును.
నొప్పి మందులు, ఆక్యుపంక్చర్, ఐస్ ప్యాక్ మరియు విశ్రాంతి వ్యాయామాలు రుతు మైగ్రేన్ తగ్గించడానికి సహాయపడతాయని మాయో క్లినిక్ సలహా ఇస్తుంది.
- తలకు గాయం వలన తలనొప్పి The head-injury headache:
అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ (AMF) ప్రకారం, తల లేదా మెదడు గాయం వల్ల సంభవించే తలనొప్పి గాయం అయిన ఏడు రోజుల్లోనే వ్యక్తమవుతుంది. తల గాయం తర్వాత వచ్చే తలనొప్పి 85%ఉద్రిక్తత తలనొప్పిని పోలి ఉంటుంది – తల వెనుక భాగంలో గరిష్ట నొప్పిని అనుభవించవచ్చు, ఎందుకంటే దెబ్బ తల వెనుక భాగంలో ఉంటుంది, లేదా భుజం మరియు మెడలోని కండరాలలో నొప్పి ఉంటుంది. మెదడు గాయం తరువాత వచ్చే తలనొప్పులు 15% మైగ్రేన్ తలనొప్పలు .
సుమారు 78% మందిలో తలనొప్పి గాయం తర్వాత మూడు నెలలు ఉంటుంది; 35%కు ఒక సంవత్సరం వరకు; మరియు 24%కు, రెండు సంవత్సరాల తరువాత కూడా ఉండవచ్చు.
AMF ప్రకారం, “మంచి నిద్ర, వ్యాయామం, విశ్రాంతి మరియు ఒత్తిడి నిర్వహణ, తగ్గిన కెఫిన్, క్రమబద్దమైన ఆరోగ్యకరమైన ఆహారం మరియు అధికంగా మందుల వాడకాన్ని నివారించడం మంచిది” అని AMF తెలిపింది.
- తలనొప్పి కి సంభందించి The concerning headache:
ఏదైనా తలనొప్పి లక్షణాలు బాగా ఉండి అది కొన్ని రోజుల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే, లేదా నిద్ర, ఆకలి లేదా దృష్టి కోల్పోతుంటే, వైద్యుడి వద్దకు వెళ్లడం అంతర్లీన సమస్యను గుర్తించడంలో సహాయపడుతుంది.