తిరుపతి జిల్లా
చిల్లకూరు మండలం లో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో మాజీ శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు.చిల్లకూరు మండల పరిధిలోని తుఫాన్ ముంపుకు గురైన కడివేడు, తిమ్మనగారి పాలెం, కలవకొండ, మోమిడి, వరగలి, వేళ్ళపాలెం, పల్లమాల గ్రామాల నందు పర్యటించారు.గ్రామాల నందు తిరుగుతూ తుఫాన్ సంభవించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
తుఫాను వలన గ్రామాలలో దెబ్బత్తిన నిమ్మ,మిరప,అరటి, వేరుశెనగ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.కొన్ని గ్రామాలలో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటివరకు అధికారులెవ్వరు రాలేదని గ్రామస్తులు చెప్పడం తెలుపుతున్నారు .
అధికారులు స్పందించి త్వరగా విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పరచాలని అన్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, నాయకులు ప్రవీణ్ రెడ్డి,దొడ్ల నాగరాజు,మూగ శంకరయ్య,వెంకట కృష్ణయ్య, కృష్ణ రెడ్డి,మునిశేఖర్ గౌడ్,గుండాల లీలావతి,దాసరి శైలజ,నేలటూరు సుప్రజ,మేకల్ కుమార్,SK జాకీర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.