ఏర్పేడు ( డిసెంబర్ 11): ఏర్పేడు మండలం మాధవ మాల పంచాయతీ లోని సుండి గ్రామం లో తొమ్మిదవ క్లస్టర్ నందు … బాబు ష్యూరిటీ – భవిష్యత్తు కి గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించి ప్రజలను కలిసి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం ద్వారా మినీ మేనిఫెస్టో లో పొందుపరిచిన మహాశక్తి పథకం ద్వారా మహిళలకు జరిగే లబ్ధిని యువతకు యువగళం నిరుద్యోగ భృతి ,రైతాంగానికి అన్నదాత పథకం , బీసీల కొరకు ప్రత్యేక రక్షణ చట్టం తదితర అంశాలను చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఈ సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం జరిగిందని వివరించినారు. ఆనాడు చంద్రబాబునాయుడు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రజలకు అందించడం జరిగింది అన్నారు. సుండి గ్రామం నందు పెద్ద ఎత్తున యువత మహిళలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ రిజిస్ట్రేషన్ ఉత్సాహంగా చేయించుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో బీసీ లకు సంబంధించిన కార్యక్రమాలను అభివృద్ధిని చేసిన ఘనత చంద్రబాబు అన్నారు కాబట్టి రేపు రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని విజ్ఞప్తి చేయడమైనది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి తో పాటు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు కే .చంద్ర రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ శ్రీ శివాజీ రెడ్డి, గ్రామ నాయకులు కన్నప్ప రెడ్డి, వెంకట మునిరెడ్డి, బాబు నాయుడు, గురువారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఈశ్వర్ తదితరులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.