అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో NHRC నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు స్టేట్ చైర్మన్ రమణ కుమార్ సూచనల మేరకుతడ మండలంలోని ఎస్టీ కాలనీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి,
స్టేట్ మీడియా సెక్రెటరీ రమేష్ మాట్లాడుతూ “భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించివేస్తోంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. జరుగుతున్నాయి, కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పిచేందుకు 1948 డిసెంబర్‌న ఐక్యరాజ్యసమితి ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ చేసింది.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వివరించారు,అనంతరం జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మునిరత్నం,
జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ మరియు జిల్లా జాయింట్ సెక్రెటరీ సావిత్రమ్మ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలోని ప్రజలందరికీ భోజన సదుపాయం కల్పించి ఆడవారికి చీరల పంపిణీ చేయడం జరిగినది,
ఎస్టి కాలనీ ప్రజలు చేపల వేట వారికి జీవన మార్గం అని దాని కొరకు వారికి చేపల వలలు కావాలని విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున ప్రతి ఒక్క కుటుంబానికి ఒక చేప వలను ఇస్తామని తిరుపతి జిల్లా టీం సభ్యులు అందరూ కలిసి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి తడ మండల సభ్యులు తుమ్మ గోపి, రాజేష్, పాల గోపీనాథ్ సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో
మణి రమేష్
స్టేట్ మీడియా సెక్రటరీ
జడ్డా చంద్ర శేఖర్
తిరుపతి జిల్లా అధ్యక్షుడు
కన్నంబకం ముని రత్నం
తిరుపతి జిల్లా ఉప అధ్యక్షుడు
ప్రవీణ్ కుమార్
జనరల్ సెక్రటరీ
సావిత్రి భాస్కర్
జాయింట్ సెక్రటరీ
శ్రీనివాసులు
సూళ్లూరుపేట డివిజన్ ఇంఛార్జి
మెరుం చంద్ర
కాళహస్తి డివిజన్ ఇంఛార్జి
తుమ్మ గోపీనాథ్
తడ ప్రసిడెంట్
పాల గోపీనాథ్
తడ కన్వీనర్
బాలాజీ
తడ వైస్ ప్రెసిడెంట్
రాజేష్
తడ జనరల్ సెక్రటరీ
భాస్కర్
నాయుడుపేట ప్రసిడెంట్
కృష్ణ
నాయుడుపేట వైస్ ప్రెసిడెంట్
కోటి మాధవ రావు
గూడూరు ప్రసిడెంట్
(కోట మండల ప్రెసిడెంట్)
దానం నరసింహరావు
గూడూరు రూరల్ ప్రసిడెంట్
డబ్బు కృపానిధి.
గూడూరు వైస్ ప్రసిడెంట్
విజయ్
శ్రీకాంత్
శివ
గూడూరు న్యూ మెంబెర్స్
K.దామోదర్ రెడ్డి
బాలాయపల్లి ప్రసిడెంట్
పాల్గొన్నారు.