Advertisements

కులాల కుళ్లను కడిగేద్దాం – అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్  అంబేద్కర్ గారి వర్ధంతి  సందర్భంగా  గూడూరు పట్టణంలోనీ పోస్ట్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు  అర్పించిన గూడూరు బీజేవైఎం నాయకులు

ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ అందరివాడని,అంబేద్కర్ ఒక కులానికో..ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్
కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కరని ,అంబేద్కర్ రచన వల్లే  రాజ్యాంగం  ఏర్పాటు సాధ్యమైందని,భారతీయులమైన మనం.. దేశ పౌరులందరికీ రక్షణగా..భారతదేశాన్ని సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని నెలకొలిపేందుకు..
రాజ్యాంగాన్ని గౌరవిద్దాం.. ముందు తరాలకూ ఆ ఫలాలను అందిద్దాం.
ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచింది.
మనమందరం కలిసి గూడూరు లో అంబెడ్కర్ భవన పునర్నిర్మాణానికి  కృషి చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శంకర్ చైతన్య నవీన్ రిషి ప్రదీప్ తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment