ఏర్పేడు (డిసెంబర్ 3 ).. గుడిసెలలో నివసిస్తున్న గిరిజనులకు అధికారులు భద్రత కలిపించాలి :యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ .
ఆదివారం (03/12/2023) గ్రామాలకు దూరంగా ఉన్న గిరిజన కాలనీలకు యువనేస్తం వాలంట్రీలు వెల్లడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ తెలిపారు. సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ ఏర్పేడు మండలం చిందేపల్లి ST కాలనీ లో గోడ పడి పిల్లవాడు చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపారు. అలాగే కొంత మందికి చెరువు కట్ట కిందన పెద్ద పెద్ద బొందలు పక్కన గుడిసెలు ఉండడం వలన గుడిసెలో ఉన్న వారు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. యువ నేస్తం అసోసియేషన్ తరపున మేము చేయు విన్నపం ఏమనగా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి గుడిసెలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి, వీరు నివసించడానికి తగు ఏర్పాట్లు చేసి ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే దాతలు కూడా స్పందించి వీరిని ఆదుకోవాల్సిందిగా యువనేస్తం అసోసియేషన్ తరుపున మేము కోరుతున్నామని తెలిపారు.