ఏర్పేడు ( డిసెంబర్ 3)… తుఫాను కు గోడ కూలి బాలుని మృతి, పరామర్శించిన ప్రగతి సంస్ధ డైరెక్టర్ కెవి రమణ. ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ గ్రామంలో భారీ వర్షాలకు ఆదివారం ఉదయం గోడ కూలి 4 సంవత్సరాల య. యశ్వంత్ మృతి చెందాడు. ప్రగతి డైరెక్టర్ కె.వి . రమణ గ్రామాన్ని సందర్శించి , బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రెండు వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా రమణ గారు మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజలందరూ సురక్షితమైన స్థలంలో ఉండవలెనని కోరారు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన షెల్టర్ నందు బస చేసిన వారికి ప్రభుత్వం వారు భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గృహాలు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ద్వారా పక్కా గృహాలు నిర్మించాలని, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులు లేని వారికి వాటిని అందించుటకు చర్యలు చేపట్ట వలనని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి సిబ్బంది వీఆర్వో, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.