Advertisements

ఆడుదాం ఆంధ్రకు మన గ్రామ యువత ప్రతి ఒక్కరూ నమోదుచేసుకోండి.. సర్పంచ్‌ కందాటి. మోహన ప్రియ

ఏర్పేడు ( డిసెంబర్ 2) … ఆడుదాం ఆంధ్రకు మన గ్రామ యువత ప్రతి ఒక్కరూ నమోదుచేసుకోండి.. సర్పంచ్‌ కందాటి. మోహన ప్రియ
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు. మధుసూదన రెడ్డి ఆదేశాలు మేరకు ఏర్పేడు మండల ఇంచార్జి గున్నేరి. కిషోర్‌ కుమార్‌ రెడ్డి సూచనలతో ఏర్పేడు మండలం, యం డి పుత్తూరు గ్రామంలో సర్పంచ్‌ మోహన ప్రియ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ఆడుదాం.. ఆంధ్ర కార్యక్రమం పట్ల అవగాహన సదస్సు నిర్వహించబడినది.ఈ సందర్భంగా సర్పంచ్‌ మోహన ప్రియ మాట్లాడుతూ , ప్రతి గ్రామంలో క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీయటానికి జగనన్న ప్రభుత్వం ఆడుదాం.. ఆంధ్ర పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమంలో మన గ్రామంలోని ప్రతి ఒక్క యువతీ, యువకులు పాల్గొనేలా, వారందరకీ అవగాహన కల్పించి పేర్లు నమోదుచేయించాలని సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి లోకముని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Comment