ఏర్పేడు ( డిసెంబర్ 2): ఏర్పేడు మండలం చింతలపాలెం గ్రామం పంచాయతీ లోని మరాఠిపురం గ్రామానికి చెందిన కొన్ని షికారుల కుటుంబాలు నిరుపేద స్థితిలో, కనీసం పూట గడవని పరిస్థితుల్లో షికారులందరూ మంగళవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పనిని కల్పించాలని ఆలిండియా వాగ్దేవి ట్రైబల్ అధ్యక్షుడు డబ్బా పరుశునాథ్ తెలియజేశాడు. అధికారులు వెంటనే స్పందించి ఈ షికారుల కుటుంబాలకు పని జాబు కార్డులను ఇప్పించి ఈ కుటుంబాలకు పనిని కల్పించగలరని అధికారులకు తెలియజేస్తున్నారు.