Advertisements

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు…

Gudur

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు…
లారీ డ్రైవర్ హత్యకేసులో ముగ్గురికి 14 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 12 వేలు జరిమానా విధిస్తూ గూడూరు 7 వ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాల మేరకు ప్రకాశం జిల్లా పెర్నామిట్టకు చెందిన శేషుకుమార్ లారీడ్రైవర్ గా, గుంటూరు అవినాష్ క్లినర్ గా ఉన్నారు. 2015 సంవత్సరంలో కేరళకు చేపల లోడుతో వెళ్లి లోడు తాలూకు డబ్బులతో తిరిగివస్తుండగా క్లీనర్ అవినాష్ ముందుగానే తన స్నేహితులైన జేష్ఠ వెంకటేష్, పోనుగంటి సుబ్బారామిరెడ్డి లకు సమాచారం ఇచ్చి డ్రైవర్ శేషుకుమార్ ని హతమార్చాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, సుబ్బారామిరెడ్డి లు కారులో కాళహస్తి దగ్గర వేచి ఉండి, అవినాష్ తో కలిసి డ్రైవర్ శేషుకుమార్ ని హతమార్చి నాయుడుపేట కాళహస్తి రోడ్డులో శేషుకుమార్ మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. విచారణ చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం నిందితులకు జీవిత ఖైదు విధించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుహాసిని వాదించారు.

Leave a Comment