ఏర్పేడు (నవంబర్ 29): ఏర్పేడు గ్రామపంచాయతీలో ఓం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలు చివర నుంచి కోబాక రోడ్డు నుంచి తిరుపతి హైవే వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణం ఏర్పేడు సర్పంచుల సంఘం అధ్యక్షులు నల్ల పాలెం శివయ్య చేపట్టారు. ఈ కాలువ నిర్మాణానికి 11 లక్షలకు పైగా అవుతుందని అంచనా, ఈ కాలువ నిర్మాణ నిధులు తిరుపతిఎంపీ మద్దిల. గురుమూర్తి గ్రాంటు ద్వారా నిధులను మంజూరు చేశారు. ఈ కాలువ నిర్మాణం సర్పంచ్ చేపట్టడం వలన ఏర్పేడు గ్రామ ప్రజలు శివయ్యకు ధన్యవాదములు తెలియజేస్తున్నారు