Advertisements

డిసెంబర్ 1న జరిగే దళిత శంఖ రవాన్ని జయప్రదం చేయండి.

  • మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్.

గూడూరు
రాష్ర్టంలో దళితుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా డిసెంబర్ 1న టీడీపి అధ్వర్యంలో జరిగే దళిత శంఖ రవాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. భుధ వారం గూడూరు పట్టణంలోనీ టీడీపి కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు .దళితులకు మేనమామ అని చెప్పుకొని అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి దళితులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.ఇకనైనా వైసీపీ ప్రభుత్వము దళితులకు రక్షణా కల్పించాలని సూచించారు. విజయవాడలో జరిగే దళిత శంఖ రావాం కుగూడూరు నియోజకవర్గం నుండి దళితులు పాల్గోని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఎస్. సి సెల్ నాయకులు జెన్నీ రమణయ్య నియోజకవర్గం ఎస్సీ నాయకులు యేసుపోగు పెంచలయ్య నియోజకవర్గం నాయకులు డాక్టర్ శ్రీపతి బాబు కోటేశ్వరరావు ఇజ్రాయేలు కుమార్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment