ఇద్దరి మిత్రుల మధ్య సెల్ ఫోన్ విషయమే జరిగిన స్వల్ప వివాదం, కృష్ణాజిల్లా గుడివాడలో యువకుడు హత్యకు దారితీసింది. ధనియాల పేటకు చెందిన రెడ్డి శ్రీను, తన మిత్రుడైన తలగడదీవి సతీష్ కు సెల్ ఫోన్ తాకట్టు పెట్టాడు. డబ్బు చెల్లిస్తా తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాల్సిందిగా మిత్రుడిని రెడ్డి శ్రీను అనేకసార్లు అడిగినా, సతీష్ స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ధనియాల పేట కాలనీలో రోడ్డుపై ఎదురుపడ్డా సతీష్ ను, తను ఫోన్ ఇస్తావా లేదా అంటూ రెడ్డి శ్రీను నిలదీశాడు.ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో కోపో దృక్తుడైన రెడ్డి శ్రీను, సతీష్ పై చేయించుకోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలో ఉన్న కొందరు యువకులు హుటాహుటిన సతీష్ ను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతను మరణించినట్లు ధ్రువీకరించారు. ఫోన్ ఇవ్వడం లేదనే కోపంతోనే సతీష్ ను కొట్టానని , రెడ్డి శ్రీను ఒప్పుకున్నాడు. విషయం తెలుసుకొని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు సతీష్ భౌతిక కాయాన్ని చూసి శోకసముద్రంలో మునిగిపోయారు.