Advertisements

ప్రధాన మంత్రి కి స్వాగతం పలికిన ప్రముఖులు

తిరుమల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తిరుపతి ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్‌తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ ,ఎంపీ ,ఎమ్మెల్సీలు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన జగన్, గవర్నర్.. శాలువా కప్పి వేంకటేశ్వరుని ప్రతిమలను బహూకరించారు. అక్కడి నుంచే నేరుగా పద్మావతి ప్రాంతాలలోని శ్రీరచన అతిథి గృహానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లిన ప్రధాని.. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు ప్రధాని మోదీ.

Leave a Comment