గూడూరు-నవంబర్26
తిరుపతి జిల్లా SP P పరమేశ్వర్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా DSEO (ASP, SEB) అధికారి అయిన A.రాజేంద్ర ఆదేశాల మేరకు చిల్లకూరు మండలంలోని భూధనం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహింస్తుండగా రాజమండ్రి డిపో కి చెందిన లగ్జరీ బస్సులో ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తుండగా గూడూరు సెబ్ సి ఐ.పి.విజయ్ కుమార్ కి పట్టుబడ్డారు.వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10) KG ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గూడూరు సెబ్ పోలీసులు స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్దాయిలని ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా సీఐ. పి.విజయకుమార్ మాట్లాడుతూ.ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా నందలి సింధూరం డాంగ్ గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి 10,000 రూపాయలకు సుమారు 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి వీరు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్దనున్న బైనా ఇటుకల ఫ్యాక్టరీ లో పనిచేస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్న గంజాయి తాగే వారికి చిన్న 10 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి 300 రూపాయల చొప్పున అమ్ముతుంటారని ముద్దాలు విచారణ తెలపారని అన్నారు. వీరిపై కేసునమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నామని సి ఐ తెలపారు.
ఈ దాడులలో పాల్గొన్న గూడూరు SEB టీమ్ వారు:
గూడూరు SEB టీం; CI P. విజయ్ కుమార్,SI A శేషమ్మ, HC M. కిరణ్ సింగ్ EC’s:- SK. గౌస్ బాషా, G. రామ్ ప్రసాద్, P. రమేష్, T.G ఆనంద బాబు.S. రాఘవయ్య. VN ప్రసాద్, ఎం. కృష్ణయ్య .
పాల్గొన్నారు.గత రెండున్నర సంవత్సరముల కాలంలో గూడూరు SEB టీమ్ గంజాయి నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించి, (50) కేసులు నమోదు చేసి, (103) మందిని అరెస్టు చేయడం జరిగింది. మరియు (561.5) కేజీల గంజాయిని, రెండు కార్లను మరియు ఒక Bike ను సీజ్ చేసినారు.
*భూదనం టోల్ ప్లాజా వద్ద నిత్యం దాడులు నిర్వహిస్తూ NH16 పైన గంజాయి రవాణాను నిరోధిస్తున్నారు.
*గంజాయి నిర్మూలనకు గూడూరు SEB టీమ్ అనేక చర్యలు చేపట్టారు:
అవి:
(1)బైండోవర్ కేసులు- 15 నమోదు చేశారు ,
(2) హిస్టరీ షీట్స్-12 తెరిచారు.
(3) మార్గద్రవ్యాలు మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మరియు ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు,
((4) మారకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ మరియు నేర సమాచారాన్ని అందించడానికి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా గూడూరు పట్టణంలో వివిధ కాలేజీల ప్రాంగణాల్లో, జనసమర్థప్రాంతాలలో(18 )హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.. అలాగే మార్గద్ర వ్యాల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు మరియు ప్రజలకు చైతన్య పరిచేలా పాంప్లెట్స్ పంచడం, కాలేజీలో డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీల ఏర్పాటు చేయడం, ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది .నేర సమాచార సేకరణకై ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్( 14500 )కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. గంజాయి వంటి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవచ్చును
అన్నారు.