Advertisements

సైబర్ క్రైమ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అత్యవసర సందేశం:

.పత్రికా ప్రకటన

రాజమహేంద్రవరం, తేదీ: 25.11.2023

సైబర్ క్రైమ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేరుతో నకిలీ వాట్సప్‌

కలెక్టర్ మాధవీలత

రోజుకో కొత్త పంథాలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయని ప్రజలు, అధికారులు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ డా కే. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటన నేపథ్యంలో డా. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు పేరిట కొందరు దుండగులు మోసం చేసేందుకు చేసిన ప్రయత్నం తాజాగా వెలుగుచూడటం సంచలనం రేకెత్తించిందని కలెక్టర్ తెలియ చేశారు. కలెక్టర్‌ ప్రొఫైల్‌ ఫొటో ఉన్న వాట్సప్‌తో కొందరు తహసీల్దార్‌లకు మెసేజ్‌లు పంపడం, అత్యవసరంగా డబ్బులు పంపాలని ఆ సందేశంలో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్ల పనిగా పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అటువంటి సందేశాలు వొస్తే వెంటనే వాటి వివరాలు పోలీసులకు , సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందచేయాలని పేర్కొన్నారు.


జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.

Leave a Comment