ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి ఏర్పేడు హమాలీ కార్మికులు తో కలిసి కరపత్రం విడుదల చేసిన నాయకులు.ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు డిసెంబర్ 17, 18 ,19 తేదీల్లో మూడు రోజులు శ్రీకాళహస్తిలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని .ఏర్పేడు వద్ద గల ఎఫ్ సి ఐ జె డబ్ల్యు. సీ. కార్మికులతో కలిసి ఏఐటీయూసీ నాయకులు కరపత్రాలు విడుదల చేయడం జరిగిందిఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య లు మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెంపు,స్కీం వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ,కనీస వేతనం 26,000 ఇవ్వడం భవన నిర్మాణ కార్మికుల తరహాలో ఆటో. హమాలీ. వీధి వర్తక వ్యాపారులు అందరికి సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అదేవిధంగా కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని . అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయబోతున్నామని ఈ మహాసభల విజయవంతం కోసం 17వ తారీఖున జరిగే పెద్ద ఎత్తున బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్. చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్ మణి. నాయకులు మహేంద్ర ,మల్లికార్జున్. –జె డబ్ల్యు సి (జగదీష్ వేర్ హౌస్ కార్పొరేషన్ లిమిటెడ్ ) కార్మికుల నాయకులు. కనికాచలం ,మణి. గురు బాలాజీ, పిచ్చిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి,రవి. మరియు కార్మిక నాయకులు పాల్గొన్నారు
{శ్రీకాళహస్తి wisdom news }