Advertisements

అసాధారణ కాన్పు చేసిన నాయుడుపేట 108 సిబ్బంది

మార్గ మద్య లో నిండు గర్భిణీ కి నాయుడుపేట 108 సిబ్బంది అసాధారణ కాన్పును సాధారణ కాన్పుచేసి పండంటి మగ బిడ్డకు పురుడుపోసిన సంఘటన శుక్రవారం జరిగింది. నాయుడుపేట 108 సిబ్బంది ఓజిలి మండలం కుందాం గ్రామం రాజుపాలెం గిరిజన కాలనీకి చెందిన బండి.సింధు 2వ కాన్పు నొప్పులు ఎక్కువ అవడంతో శుక్రవారం మధ్యాహ్నం 2గంటల కు108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు.నాయుడుపేట 108 అంబులెన్స్ సిబ్బంది ఈ ఏం టి బల్లి.కిరణ్ కుమార్ , పై ల ట్ పల్లం. సతీష్ హుటాహుటిన బయలుదేరి కుందాం కు చేరుకుని నిండు గర్భిణీ ని అంబులెన్స్ లోకి తరలించి గుడూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో కాన్పు నొప్పులు ఎక్కువ అవడంతో అంబులెన్స్ లొనే ఆన్లైన్ డాక్టర్ మహేశ్వరి సలహాలు ఆన్లైన్ లో తీసుకుంటూ బిడ్డ మెడకు జరాయువు చుట్టుకొని ఉండడంతో తల వచ్చి ఆగిపోవడం తో ఆన్లైన్ డాక్టర్ మహేశ్వరి సలహాలతో బిడ్డ ను పూర్తిగా డెలివరీ చేశారు.ఈ కష్ట తరమైన కాన్పును 108 అంబులెన్స్ లొనే ఈ ఎం టి బల్లి కిరణ్ కుమార్ చాక చక్యం గా పూర్తి స్థాయి డెలివరీ చేసి బిడ్డకు నియోనేటల్ కేర్ ఇవ్వడంతో బిడ్డ ఏడవడం మొదలు పెట్టింది. బిడ్డ ఎడవడంతో ఒక్కసారిగా తల్లి ముఖములో చిరునవ్వు వచ్చింది. పండంటి మగ బిడ్డ పురుడు పోసుకుంది.తల్లి బిడ్డా క్షేమంగా ఉండడంతో తల్లి బిడ్డను 108 లో తరలించి గుడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.వీరి కుటుంబ సభ్యలు కూడా ఒక్కసారిగా ఆనందపడ్డారు. 108 సిబ్బంది అంబులెన్స్ లొనే పురుడు పోయడం తో నాయుడుపేట 108 సిబ్బంది ని సింధు కుటుంబసభ్యులు అభినందించారు.ఈ విషయం తెలుసుకొని కష్ట తరమైన కాన్పును సాధారణ కాన్పు చేసి పండంటి మగ బిడ్డను ఎంతో చాకచక్యంగా డెలివరీ చేసినందుకు గాను తిరుపతిజిల్లా108 అంబులెన్సు ల నిర్వాహణా జోనల్ మేనేజర్ రాకేష్,ఆపరేషన్ ల్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసులు108 అంబులెన్సు సిబ్బంది ని అభినందించారు.

Leave a Comment