బాలాయపల్లి వైస్సార్సీపీ కన్వీనర్ వెందోటి కార్తీక్ రెడ్డిబాలాయపల్లి మండలం పరిధిలోని కయ్యురు సచివాలయం పరిధిలో లో బాలాయపల్లి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెందోటి.కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెందోటి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలను అక్కున చేర్చుకుని వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు.బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకు రాజకీయాలకు పరిమితం చేసిన చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బడుగు,బలహీన వర్గాలను విస్మరించారని విమర్శించారు.సామాజిక సాధికారతే ధ్యేయంగా అన్ని వర్గాలకు న్యాయం చేసి, రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా బడుగులకు అవకాశం కల్పించి,రెండేళ్ల కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించి, ఆర్థికంగా,ఆరోగ్యంగా భద్రతను,నమ్మకాన్ని కల్పించి మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.నాడు–నేడుతో విద్యారంగంలో,సురక్ష ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి 96 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తూ,అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా జగనన్న అమ్మ ఒడి,వసతి దీవెన,విద్యాదీవెన,వైఎస్సార్ రైతు భరోసా,సున్నావడ్డీ,ఉచిత పంటల బీమా,ఫించన్ కానుక, చేయూత,ఆసరా,నేతన్న నేస్తం, జగనన్న చేదోడు,కళ్యాణమస్తు, షాదీతోఫా,జగనన్న తోడు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని వివరించారు. అంతకుముందు వైయస్సార్ పార్టీ జెండాను ఆవిష్కరించి,గడప గడపకు వెళ్లి,ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ,సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బాలాయపల్లి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెందోటి కార్తీక్ రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు వేమూరు వెంకటరమణారెడ్డి, పల్లంటి రాంబాబు, రంగనాథం, వైఎస్ఆర్ సీపీ నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు, గుండు బోయిన గోపాల యాదవ్, కాటూరు ప్రసాద్ రెడ్డి, సర్వేపల్లి సురేషు, సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటరీలు,సంబధిత అధికారులు పాల్గొన్నారు.