నిరుపేదల, ఆడపిల్లల సామాజిక భద్రతకై అమలు చేస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. RDO కిరణ్ కుమార్
ప్రజల శ్రేయసు కొరకు ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి పథకం ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఆర్ డి ఓ కిరణ్ కుమార్
ఆడ బిడ్డలపై మీద మమకారం, అభిమానం ఉన్న వ్యకి గా ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు ఉపయోగ పడే అవకాశాన్ని తెలిపిన RDO
ఇటు సేవా కార్యక్రమాలే కాక, ఎంతో మంది నిరు పేదలను ఆదుకున్న ఆర్డిఓ, డివిజన్లో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ అవకాశాలను తెలియజేస్తున్న ఆర్ డి ఓ కిరణ్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలే కాక కేంద్రం నుండి వస్తున్న పథకాలను కూడా ప్రజల ఉపయోగించుకోవాలని సూచించిన ఆర్ డి ఓ
తపాలా కార్యాలయాల ద్వారా రు.400/- కే 10 లక్షల యాక్సిడెంటల్ బీమా పాలసీ
ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన
పోస్టాఫీస్ పథకాలు సద్వినియోగం చేసుకోండి- RDO కిరణ్ కుమార్
కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్) ద్వారా నిరుపేదల, ఆడపిల్లల సామాజిక భద్రతకై అమలు చేస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని RDO కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అతి తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనంతో జిల్లాలోని వివిధ తపాలా కార్యాలయాలలో ఈ పథకాలు లభ్యమవుతున్నాయని RDO తెలిపారు
ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినపుడు బాధితుల కుటుంబాలు రోడ్డున పడకుండా వారిని ఆదుకునేందుకు గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ (జి ఎ జి) పాలసీని తపాలా శాఖ ప్రవేశపెట్టిందని అన్నారు.
ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో వ్యక్తి కేవలం 400 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల భీమా కవరేజ్ లభిస్తుందన్నారు. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ పథకంలో చేరవచ్చునని RDO వివరించారు.
సుకన్య సమృద్ధి యోజన పథకం క్రింద 0-10 సం లోపు ఆడపిల్లల పేరున వారి తల్లిదండ్రులు గాని చట్టపరమైన సంరక్షకులు గాని కేవలం రు.100 రూపాయల నెలవారి డిపాజిట్ తో ఈ పథకంలో చేరవచ్చునని, ఆడపిల్లకు 21 సంవత్సరాలు నిండిన తరువాత 53,945 రూపాయల ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
ఈ సేవలు జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ పథకాల గురించి ఇతర వివరాలకు ప్రజలు వారి దగ్గరలోని తపాలా కార్యాలయాల్లో సంప్రదించాలని RDO తెలిపారు. *(WIsdom news)*