నెల్లూరు జిల్లా కోవూరు సమీపం లో జాతీయ రహదారిపై సెబ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో చెన్నై నుండి వైజాగ్ వెళుతున్న శ్రీకృష్ణ ట్రావెల్ బస్సులో గల్ఫ్ దేశాలకు చెందిన 43 లీటర్ల మద్యం బాటిల్లు సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెబ్ సీఐ నరహరి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీల్లో చెన్నై నుంచి వైజాగ్ కి వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్ బస్సులో గల్ఫ్ దేశాలు కూర్చున్న 43 లీటర్ల మద్యాన్ని గుర్తించామని తెలిపారు. అక్రమంగా మధ్యన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరు చెన్నైలోని నవీన్ అనే వ్యక్తి దగ్గర నుండి మద్యాన్ని తీసుకొని వైజాగ్ లో ఉన్న వెంకటేశ్వర్లు కు అందజేస్తుంటారని తెలిపారు. ఈ విధంగా అందజేసినందుకు ఒక బాక్స్ కి ₹2,000 చొప్పున వాళ్లకి ఇస్తారని డబ్బు కు ఆశపడి ఈ పని చేశారని చెప్పారు.పక్కా సమాచారంతో తనిఖీ చేసి మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.