వైకాపా మండలం కన్వీనర్ మన్నారపు రవికుమార్
సైదాపురం నవంబర్-22 .(విస్డం న్యూస్)
రెండు రోజుల క్రితం వెంకటగిరి మాజీఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సైదాపురం మైన్స్ విమర్శలకు కౌంటర్ గా టిడిపి వారికి వాస్తవాలు తెలియజేయాలని సైదాపురం మండలం వైకాపా కన్వీనర్ మన్నారపు రవికుమార్ మీడియా సమావేశం పెట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్ లో రెండు రకాలు. విత్ లైసెన్స్, వితౌట్ లైసెన్స్. లైసెన్స్ తీసుకొని ఎవరైనా చేసుకోవచ్చన్నారు దానికి పార్టీలతో సంబంధం లేదన్నారు మరొకటి అక్రమ మైనింగ్ అది అనుమతి లేకుండా చేసేదేనన్నారు.ఆ తరహాలో అక్రమ మైనింగ్ చేసి పట్టుబడుతున్నది టిడిపి వారే కాదా.రెండు రోజుల క్రితం దాదాపుగా 10 పెద్ద యంత్రాలు రాపూర్ సిఐ వారి బృందం సీజ్ చేశారు. అంతకుముందు ఎన్ని బండ్లు సీజ్ చేశారో అవి మీ టిడిపి నేతలవి కాదా?అసలు అక్రమ మైనింగ్ లో ఉన్న రింగ్ లీడర్ కృష్ణంరాజు మీ టిడిపి పార్టీ కాదా?మీ టిడిపి సర్పంచ్ కాదా? మీ టిడిపి మాజీ మండల కన్వీనర్ కాదా? మీకు 2019 ఎలక్షన్లలో మీకు ఖర్చు పెట్టారా లేదా? రాబోయే 2024 ఎలక్షన్లో మీకు ఖర్చు పెట్టేందుకు ఒప్పందం కుదరలేదా? మా ప్రభుత్వం అక్రమ మైనింగ్ మీద ఉక్కు పాదం పెట్టింది. తరచూ పగలు రాత్రి మరియు దారి డొంకా లేని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దానికి పోలీస్ శాఖవారినిఆభినందిస్తున్నామన్నారు.పట్టుబడిన వారు వెనక ఉన్నా ముద్దాయిలను కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నామన్నారు. వారు నామ మాత్రం ఫైన్లు కట్టి మరల అక్రమ మైనింగ్ లో పాల్గొంటున్నారన్నారు అలాకాకుండా పట్టుబడిన బండ్లులను కోర్టుకు పెట్టి కఠినంగా శిక్షించ వలసిందిగా కోరుతున్నామని మా నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇటువంటివి ప్రోత్సహించుడన్నారు, ఎవరు చేసినా ఒప్పుకోరన్నారు. ఈ కార్యక్రమం లో వి ప్రభాకర్ రెడ్డి,సొసైటీ అధ్యక్షులు గోగినేని శివకుమార్,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.